చట్టపరమైన చర్యలు : ముషారఫ్
జిల్లాలో బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఆలీ ఫారుఖీ పోలీసు, ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ ఛాంబర్‌లో నిర్వహించిన జిల్లా క్షయ ఫోరం, జిల్లాస్థాయి కో-ఆర్డినేషన్ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… జిల్లాలో క్షయ వ్యాధి పరీక్షలు విస్తృతంగా నిర్వహించేందుకు వీలుగా గ్రామ పంచాయతీల్లో యువజన సంఘాలు, మహిళా సంఘాలు, […]
జిల్లాలో బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఆలీ ఫారుఖీ పోలీసు, ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ ఛాంబర్‌లో నిర్వహించిన జిల్లా క్షయ ఫోరం, జిల్లాస్థాయి కో-ఆర్డినేషన్ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… జిల్లాలో క్షయ వ్యాధి పరీక్షలు విస్తృతంగా నిర్వహించేందుకు వీలుగా గ్రామ పంచాయతీల్లో యువజన సంఘాలు, మహిళా సంఘాలు, ప్రజారోగ్య శాఖతో ఒప్పందం కుదుర్చుకొని క్షయ చికిత్స, క్రమం తప్పకుండా మందులు వాడే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామపంచాయతీ స్థాయి, పట్టణ స్థాయి టీబీ క్లబ్బులను ప్రతి నెల రెండో గురువారం నిర్వహించాలన్నారు. అన్ని శాఖల అధికారులు, ప్రజా సంఘాలు, టీబీ వ్యాధి గ్రస్తులు క్రమం తప్పకుండా పాల్గొనాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ శ్రీనివాసరావు, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా పరిషత్ సీఈఓ సుధీర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వసంత్ రావ్, జిల్లా ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సురేష్, జిల్లా టీబీ నివారణ అధికారి డాక్టర్ కార్తీక్, జిల్లా విద్యాశాఖ అధికారి ప్రణీత జిల్లా కార్మిక అధికారి శ్రావణి, డీఎస్పీ ఉపెందర్‌రెడ్డి పాల్గొన్నారు.