తమను ఆదుకున్న భారత్‌ను కాపాడుకుంటాం : బైడెన్‌

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా వైరస్ ఉగ్రరూపం దాల్చింది. రోజురోజుకూ భయంకరంగా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో పాటు, మరణాల సంఖ్య కూడా రికార్డు స్థాయిలో నమోదు అవుతున్నాయి. దీంతో జనాలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో భారత్ పరిస్థితి గమనించిన ప్రపంచ దేశాలు ఇండియాకు సాయం చేస్తామని, ఆదుకుంటామని ముందుకొస్తున్నాయి. అందులో భాగంగానే క‌రోనాతో పోరాడుతున్న ఇండియాకు అవ‌స‌ర‌మైన అన్ని రకాల స‌హాయం చేస్తామ‌ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, ఉపాధ్యక్షురాలు క‌మ‌లా హ్యారిస్‌ […]

Update: 2021-04-25 23:54 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో కరోనా వైరస్ ఉగ్రరూపం దాల్చింది. రోజురోజుకూ భయంకరంగా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో పాటు, మరణాల సంఖ్య కూడా రికార్డు స్థాయిలో నమోదు అవుతున్నాయి. దీంతో జనాలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో భారత్ పరిస్థితి గమనించిన ప్రపంచ దేశాలు ఇండియాకు సాయం చేస్తామని, ఆదుకుంటామని ముందుకొస్తున్నాయి. అందులో భాగంగానే క‌రోనాతో పోరాడుతున్న ఇండియాకు అవ‌స‌ర‌మైన అన్ని రకాల స‌హాయం చేస్తామ‌ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, ఉపాధ్యక్షురాలు క‌మ‌లా హ్యారిస్‌ స్పష్టం చేశారు. క‌ష్ట స‌మ‌యాల్లో ఇండియా త‌మ‌కు అండ‌గా నిలిచింద‌ని, ఇప్పుడు తాము కూడా అదే ప‌ని చేస్తామ‌ని బైడెన్, కమలా ట్వీట్టర్ వేదికగా స్పందించారు.

ఇండియాకు అత్యవ‌స‌ర‌మైన మందులు, ప‌రిక‌రాలు పంపిస్తున్నట్లు వెల్లడించారు. మ‌హ‌మ్మారి తొలినాళ్లలో మా హాస్పిట‌ల్స్ కొవిడ్ పేషెంట్లతో కిక్కిరిసిపోయి ఒత్తిడిలో ఉన్న స‌మ‌యంలో ఇండియా మాకు సాయం చేసింది. ఇప్పుడు మేము కూడా ఇండియాకు అవ‌స‌ర‌మైన సాయం చేస్తాం అని బైడెన్ త‌న ట్వీట్‌లో స్పష్టం చేశారు. కాగా, అమెరికాతో పాటు ఇంగ్లాండ్, బ్రిటన్, ఫ్రాన్స్‌, ఆస్ట్రేలియా, జర్మనీ, చైనా ఇలా అనేక దేశాలు.. ‘‘భారత్‌ అవసరాల మేరకు సాయం అందించడానికి మేం సిద్ధంగా ఉన్నామని, భారతీయులు త్వరలోనే మహమ్మారిని ఓడిస్తారని విశ్వసిస్తున్నామని తెలుపుతున్నారు.

Tags:    

Similar News