పీఆర్సీ ఇచ్చే దాకా పోరాటం: కల్పదర్శి చైతన్య

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ఉద్యోగుల వ్యతిరేక ప్రభుత్వం కొనసాగుతోందని, ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కావడం లేదని బహుజన టీచర్స్​ అసోసియేషన్​ (బీటీఏ) రాష్ట్ర అధ్యక్షుడు కల్పదర్శి చైతన్య మండిపడ్డారు. హైదరాబాద్​లోని శాంతిచక్ర సమావేశ మందిరంలో కల్పదర్శి అధ్యక్షతన రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కల్పదర్శి చైతన్య మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే అమలు చేయాలని డిమాండ్​ చేశారు. ఇప్పటికే చాలా జాప్యం చేస్తున్నారని, పీఆర్సీ ప్రకటించకుంటే అన్ని ఉద్యోగ […]

Update: 2020-12-12 10:40 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ఉద్యోగుల వ్యతిరేక ప్రభుత్వం కొనసాగుతోందని, ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కావడం లేదని బహుజన టీచర్స్​ అసోసియేషన్​ (బీటీఏ) రాష్ట్ర అధ్యక్షుడు కల్పదర్శి చైతన్య మండిపడ్డారు. హైదరాబాద్​లోని శాంతిచక్ర సమావేశ మందిరంలో కల్పదర్శి అధ్యక్షతన రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో కల్పదర్శి చైతన్య మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే అమలు చేయాలని డిమాండ్​ చేశారు. ఇప్పటికే చాలా జాప్యం చేస్తున్నారని, పీఆర్సీ ప్రకటించకుంటే అన్ని ఉద్యోగ సంఘాలు ఐక్య కార్యా చరణతో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టుతాయని హెచ్చరించారు. ప్రభుత్వం పీఆర్సీ అమలు కోసం అన్ని ఉద్యోగ సంఘాల ప్రతినిధులను ఆహ్వానించి చిత్తశుద్ధిని చాటుకోవాలని ఆయన సూచించారు.

Tags:    

Similar News