2022 ఆగస్టు నాటికి వెలిగొండ ప్రాజెక్టు ద్వారా నీరందిస్తాం

దిశ, ఏపీ బ్యూరో: వెలిగొండ ప్రాజెక్టును 2022 ఆగస్టు నాటికి పూర్తి చేస్తామని మంత్రి విశ్వరూప్ స్పష్టం చేశారు. నిర్ణీత సమయానికి ప్రాజెక్టును పూర్తి చేసి ప్రాజెక్టు ద్వారా రైతాంగానికి సాగునీరందిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లాలో బుధవారం పర్యటించిన విశ్వరూప్ కేంద్ర గెజిట్‌లో వెలిగొండ ప్రాజెక్టు లేదంటూ ప్రతిపక్షాలు రాద్ధాంతం చేయడంపై మండిపడ్డారు. వెలిగొండ ప్రాజెక్టు గెజిట్‌లో లేని విషయంతో పాటు పూర్తి సమాచారాన్ని కేంద్రానికి అందించినట్లు తెలిపారు. ఇప్పటికే ప్రాజెక్టు పనులు పూర్తయ్యాయని.. […]

Update: 2021-09-15 07:20 GMT

దిశ, ఏపీ బ్యూరో: వెలిగొండ ప్రాజెక్టును 2022 ఆగస్టు నాటికి పూర్తి చేస్తామని మంత్రి విశ్వరూప్ స్పష్టం చేశారు. నిర్ణీత సమయానికి ప్రాజెక్టును పూర్తి చేసి ప్రాజెక్టు ద్వారా రైతాంగానికి సాగునీరందిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లాలో బుధవారం పర్యటించిన విశ్వరూప్ కేంద్ర గెజిట్‌లో వెలిగొండ ప్రాజెక్టు లేదంటూ ప్రతిపక్షాలు రాద్ధాంతం చేయడంపై మండిపడ్డారు.

వెలిగొండ ప్రాజెక్టు గెజిట్‌లో లేని విషయంతో పాటు పూర్తి సమాచారాన్ని కేంద్రానికి అందించినట్లు తెలిపారు. ఇప్పటికే ప్రాజెక్టు పనులు పూర్తయ్యాయని.. ఇంకా కేవలం 6.5 కిలోమీటర్ల టన్నెల్ పనులు మాత్రమే మిగిలి ఉన్నాయని తెలిపారు. వెలిగొండ ప్రాజెక్టు విషయంలో సీఎం జగన్ చిత్తశుద్ధితో ఉన్నారన్నారని.. ప్రాజెక్టు విషయంలో జిల్లా ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి విశ్వరూప్ హామీ ఇచ్చారు.

Tags:    

Similar News