ప్లాన్ బీ.. యూఏఈలో టీ20 వరల్డ్ కప్‌..?

దిశ, స్పోర్ట్స్: ఇండియాలో కరోనా సెకెండ్ వేవ్ విజృంభిస్తుండటంతో ఈ ఏడాది అక్టోబర్‌లో జరగాల్సిన పురుషుల టీ20 వరల్డ్ కప్‌పై సందిగ్దత నెలకొన్న సంగతి తెలిసిందే. మెగా ఈవెంట్ రద్దవుతుందేమో అని క్రికెట్ ప్రేమికులు ఆందోళన చెందుతున్న సమయంలో బీసీసీఐ శుభవార్త చెప్పింది. అక్టోబర్ నాటికి పరిస్థితి అదుపులోకి రాకపోతే ఐసీసీ చెప్పిన ప్లాన్-బి అమలు చేస్తామని స్పష్టం చేసింది. ఈ సారి టోర్నమెంట్ వాయిదా వేయకుండా యూఏఈలో నిర్వహిస్తామని బీసీసీఐ అంటోంది. టోర్నీ అక్కడ జరిగినా.. […]

Update: 2021-04-30 10:57 GMT

దిశ, స్పోర్ట్స్: ఇండియాలో కరోనా సెకెండ్ వేవ్ విజృంభిస్తుండటంతో ఈ ఏడాది అక్టోబర్‌లో జరగాల్సిన పురుషుల టీ20 వరల్డ్ కప్‌పై సందిగ్దత నెలకొన్న సంగతి తెలిసిందే. మెగా ఈవెంట్ రద్దవుతుందేమో అని క్రికెట్ ప్రేమికులు ఆందోళన చెందుతున్న సమయంలో బీసీసీఐ శుభవార్త చెప్పింది. అక్టోబర్ నాటికి పరిస్థితి అదుపులోకి రాకపోతే ఐసీసీ చెప్పిన ప్లాన్-బి అమలు చేస్తామని స్పష్టం చేసింది. ఈ సారి టోర్నమెంట్ వాయిదా వేయకుండా యూఏఈలో నిర్వహిస్తామని బీసీసీఐ అంటోంది. టోర్నీ అక్కడ జరిగినా.. హోస్ట్ మాత్రం బీసీసీఐ పేరిటే ఉంటుందని.. కేవలం తటస్థ వేదిక పేరుతో మెగా టోర్నీ నిర్వహిస్తామని బీసీసీఐ జనరల్ మేనేజర్ ఆఫ్ గేమ్ డెవెలెప్‌మెంట్ ధీరజ్ మల్హోత్రా స్పష్టం చేశారు.

Tags:    

Similar News