ఫలితాలు ఎలా ఉన్నా స్వాగతిస్తాం..

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఎలా వచ్చినా స్వాగతిస్తామని, అభివృద్ధే తమ లక్ష్యమని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఆదివారం మహబూబ్ నగర్-హైదరాబాద్-రంగారెడ్డి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నికలు ప్రశాంతంగా ముగిసిన నేపథ్యంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల సందర్భంగా ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం సహజమేనన్నారు. రికార్డు స్థాయిలో పట్టభద్రులు ఓటు హక్కు వినియోగించుకోవడం అభినందనీయమని, ఏకంగా 76 శాతం పైగా […]

Update: 2021-03-14 09:30 GMT

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఎలా వచ్చినా స్వాగతిస్తామని, అభివృద్ధే తమ లక్ష్యమని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఆదివారం మహబూబ్ నగర్-హైదరాబాద్-రంగారెడ్డి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నికలు ప్రశాంతంగా ముగిసిన నేపథ్యంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల సందర్భంగా ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం సహజమేనన్నారు. రికార్డు స్థాయిలో పట్టభద్రులు ఓటు హక్కు వినియోగించుకోవడం అభినందనీయమని, ఏకంగా 76 శాతం పైగా పోలింగ్ కావడం విశేషమన్నారు. పది రోజులుగా ఎన్నికల కోసం శ్రమించిన నాయకులు, కార్యకర్తలను అభినందించారు.

 

Tags:    

Similar News