ఈ నిర్ణయాన్ని అప్పుడే ప్రకటించి ఉంటే బాగుండేది: టీఆర్ఎస్ నేతలు
దిశ, అచ్చంపేట: కేంద్ర ప్రభుత్వం సాగు చట్టాలను వెనక్కి తీసుకోవడాన్ని స్వాగతిస్తున్నామని టీఆర్ఎస్ పార్టీ మండల యూత్ అధ్యక్షుడు ఆలూరి కర్ణబాబు అన్నారు. శుక్రవారం నాగర్ కర్నూల్ జిల్లాలోని అమ్రాబాద్ మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ ఇది రైతుల విజయం అని చెప్పారు. ఈ పోరాటంలో పదుల సంఖ్యలో రైతులు మరణించక ముందే ప్రధాని ఈ నిర్ణయాన్ని అప్పుడే ప్రకటించి ఉంటే బాగుండేదని ఆయన అన్నారు. దేశ రైతాంగానికి ప్రజలకు ప్రధాని క్షమాపణ చెప్పడం హుందాగా ఉందన్నారు. […]
దిశ, అచ్చంపేట: కేంద్ర ప్రభుత్వం సాగు చట్టాలను వెనక్కి తీసుకోవడాన్ని స్వాగతిస్తున్నామని టీఆర్ఎస్ పార్టీ మండల యూత్ అధ్యక్షుడు ఆలూరి కర్ణబాబు అన్నారు. శుక్రవారం నాగర్ కర్నూల్ జిల్లాలోని అమ్రాబాద్ మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ ఇది రైతుల విజయం అని చెప్పారు. ఈ పోరాటంలో పదుల సంఖ్యలో రైతులు మరణించక ముందే ప్రధాని ఈ నిర్ణయాన్ని అప్పుడే ప్రకటించి ఉంటే బాగుండేదని ఆయన అన్నారు. దేశ రైతాంగానికి ప్రజలకు ప్రధాని క్షమాపణ చెప్పడం హుందాగా ఉందన్నారు. రైతు పోరాటాలకు ముందే నిర్ణయం తీసుకుంటే బాగుండేది అని అన్నారు. ఆలస్యంగా నైనా సరైన నిర్ణయం తీసుకోవడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో ప్రధాన కార్య దర్శిరవి, జగన్, నరేశ్, అంజీ, అంతరాములు పాల్గొన్నారు.