సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తున్నాం : నాని

దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వం, ఉద్యోగుల పిటిషన్లు కొట్టేసిన దేశ అత్యున్నత న్యాయస్థానం.. పంచాయతీ ఎన్నికలు జరపాల్సిందే అని తీర్పు వెల్లడించింది. దీనిపై మంత్రి పేర్ని నాని స్పందిస్తూ.. పంచాయతీ ఎన్నికల విషయంలో సుప్రీంకోర్టు వెల్లడించిన తీర్పును గౌరవిస్తామని తెలిపారు. బాధ్యతలు మరిచిన ఎస్ఈసీ రాజకీయాలు చేస్తూ.. గట్టిగా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఇలాంటప్పుడు 2018లో ఎన్నికలు ఎందుకు నిర్వహించలేదని ప్రశ్నించారు. ఎవరి రాజ్యాగాన్ని వాళ్లు రాసేసుకుంటున్నారని మండిపడ్డారు. గతంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ ఎన్నికలు మధ్యలో ఆపేసి.. రాజకీయ […]

Update: 2021-01-25 08:42 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వం, ఉద్యోగుల పిటిషన్లు కొట్టేసిన దేశ అత్యున్నత న్యాయస్థానం.. పంచాయతీ ఎన్నికలు జరపాల్సిందే అని తీర్పు వెల్లడించింది. దీనిపై మంత్రి పేర్ని నాని స్పందిస్తూ.. పంచాయతీ ఎన్నికల విషయంలో సుప్రీంకోర్టు వెల్లడించిన తీర్పును గౌరవిస్తామని తెలిపారు. బాధ్యతలు మరిచిన ఎస్ఈసీ రాజకీయాలు చేస్తూ.. గట్టిగా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఇలాంటప్పుడు 2018లో ఎన్నికలు ఎందుకు నిర్వహించలేదని ప్రశ్నించారు. ఎవరి రాజ్యాగాన్ని వాళ్లు రాసేసుకుంటున్నారని మండిపడ్డారు. గతంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ ఎన్నికలు మధ్యలో ఆపేసి.. రాజకీయ కుట్ర చేస్తున్నారని అన్నారు.

Tags:    

Similar News