అమరావతిని పరిరక్షించుకుంటాం : లోకేష్

దిశ, వెబ్ డెస్క్: ప్రజా రాజధాని అమరావతిని పరిరక్షించుకుని తీరుతామని టీడీపీ నేత నారా లోకేష్ స్పష్టంచేశారు. ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ అనేది టీడీపీ నినాదమని వివరించారు. న్యాయస్థానాల్లో ప్రజల ఆకాంక్షలకు న్యాయం జరుగుతుందని చెప్పారు. వ్యవస్థల్ని నాశనం చేయడం సీఎం జగన్ రెడ్డి ట్రేడ్‌మార్క్‌గా మారిపోయిందని తప్పుబట్టారు. ఆ ట్రాప్‌లో గవర్నర్ బిశ్వభూషన్ చిక్కుకోవడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టని వ్యాఖ్యానించారు. మూడు ముక్కలాటకి గవర్నర్ గ్రీన్ సిగ్నలివ్వడం రాష్ట్ర చరిత్రలో ఓ చీకటి రోజని […]

Update: 2020-07-31 08:11 GMT

దిశ, వెబ్ డెస్క్: ప్రజా రాజధాని అమరావతిని పరిరక్షించుకుని తీరుతామని టీడీపీ నేత నారా లోకేష్ స్పష్టంచేశారు. ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ అనేది టీడీపీ నినాదమని వివరించారు. న్యాయస్థానాల్లో ప్రజల ఆకాంక్షలకు న్యాయం జరుగుతుందని చెప్పారు.

వ్యవస్థల్ని నాశనం చేయడం సీఎం జగన్ రెడ్డి ట్రేడ్‌మార్క్‌గా మారిపోయిందని తప్పుబట్టారు. ఆ ట్రాప్‌లో గవర్నర్ బిశ్వభూషన్ చిక్కుకోవడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టని వ్యాఖ్యానించారు. మూడు ముక్కలాటకి గవర్నర్ గ్రీన్ సిగ్నలివ్వడం రాష్ట్ర చరిత్రలో ఓ చీకటి రోజని చెప్పుకొచ్చారు.

జగన్ రెడ్డి ఎస్ఈసీ విషయంలో ఇలానే తొందరపడి తప్పుడు నిర్ణయం తీసుకుని మొట్టికాయలు తిన్నారని ఈ సందర్భంగా లోకేశ్ గుర్తుచేశారు. ఇప్పుడు మూడు ముక్కలాటలో మరోసారి వైసీపీ ప్రభుత్వానికి భంగపాటు తప్పదని లోకేష్ హెచ్చరించారు.

Tags:    

Similar News