మాకు రక్షణ కల్పించండి : ఎస్పీకి వైఎస్ వివేకా కుమార్తె లేఖ

దిశ, ఏపీ బ్యూరో: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో సీబీఐ దూకుడు పెంచింది. కేసును 68రోజులుగా సీబీఐ విచారిస్తోంది. ఇలాంటి తరుణంలో వైఎస్ వివేకానందరెడ్డి కూతురు సునీతారెడ్డి కడప ఎస్పీ అన్బురాజన్‌కు లేఖ రాయడం సంచలనంగా మారింది. పులివెందులలో తన కుటుంబానికి భద్రత కల్పించాలని ఆ లేఖలో కోరారు. ఈ నెల 10న మణికంఠారెడ్డి అనే వ్యక్తి తమ నివాస పరిసర ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించారని ఫిర్యాదులో ఆరోపించారు. తన తండ్రి హత్య […]

Update: 2021-08-13 05:12 GMT

దిశ, ఏపీ బ్యూరో: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో సీబీఐ దూకుడు పెంచింది. కేసును 68రోజులుగా సీబీఐ విచారిస్తోంది. ఇలాంటి తరుణంలో వైఎస్ వివేకానందరెడ్డి కూతురు సునీతారెడ్డి కడప ఎస్పీ అన్బురాజన్‌కు లేఖ రాయడం సంచలనంగా మారింది. పులివెందులలో తన కుటుంబానికి భద్రత కల్పించాలని ఆ లేఖలో కోరారు. ఈ నెల 10న మణికంఠారెడ్డి అనే వ్యక్తి తమ నివాస పరిసర ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించారని ఫిర్యాదులో ఆరోపించారు. తన తండ్రి హత్య కేసులో అనుమానితుడిగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి అనుచరుడే మణికంఠారెడ్డి అని ఆమె తెలిపారు. లేఖను నేరుగా ఎస్పీ అన్బురాజన్‌కు అందజేయాలని ఆమె ప్రయత్నించారు. అయితే ఎస్పీ అందుబాటులో లేకపోవడంతో సిబ్బందికి సునీతారెడ్డి లేఖ అందజేశారు.

 

Tags:    

Similar News