Good News: ఇంటి నిర్మాణాలకు రూ. 3,220 కోట్ల సాయం

రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఆదివాసీ గిరిజనులకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది....

Update: 2025-04-01 14:04 GMT
Good News: ఇంటి నిర్మాణాలకు రూ. 3,220 కోట్ల సాయం
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఆదివాసీ గిరిజనులకు కూటమి ప్రభుత్వం(Government) గుడ్ న్యూస్ తెలిపింది. ఇంటి నిర్మాణాల్లో(House Constructions) పడుతున్న కష్టాలు, ఆర్ధిక ఇబ్బందులను గుర్తించింది. ఆర్థిక సాయం అందించేందుకు చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో అసంపూర్తిగా ఉన్న 5.99 లక్షల ఇళ్ల నిర్మాణాలకు రూ. 3,220 కోట్లు అదనపు ఆర్థిక సాయం ప్రకటించింది. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన 1.0 పథకం, అర్బన్ బి.ఎల్. సి., గ్రామీణ్, జన్ మన్ స్కీముల కింద 2016-2024 మధ్య కాలంలో 7.32 లక్షల మంది ఇళ్లు పూర్తి చేయాలనే లక్ష్యం పెట్టుకుంది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఇంటి యూనిట్ విలువకు అదనంగా ప్రతి షెడ్యూల్ కులం వారికి రూ. 50 వేలు, వెనక బడిన తరగతుల వారికి రూ. 50 వేలు, షెడ్యూలు తెగలకు రూ. 75 వేలు, ఆదివాసీ గిరిజనులకు రూ. లక్ష చొప్పున ప్రభుత్వం అదనపు ఆర్థిక సాయం అందించనుంది.

ఈ అదనపు ఆర్థిక సాయాన్ని నాలుగు విడతలలో (బేస్మెంట్ స్థాయి, రూఫ్ లెవెల్ స్థాయి, స్లాబు స్థాయి, ఇల్లు పూర్తి స్థాయి) లబ్దిదారుల వ్యక్తిగత ఖాతాలకు నేరుగా ఆర్థిక సాయం జమ చేస్తుంది. లబ్దిదారులందరూ వినియోగించుకొని, సత్వరమే ఇంటి నిర్మాణాలను పూర్తి చేసుకోవాలని రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ పి. రాజబాబు తెలిపారు.

Tags:    

Similar News