రఘురామ కేసు.. ఆమెకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది...

దిశ, వెబ్ డెస్క్: డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు (Deputy Speaker Raghurama Krishnam Raju) కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. డాక్టర్ ప్రభావతి (Dr. Prabhavati) విచారణకు హాజరుకావాలని సుప్రీంకోర్టు (Supreme Court) ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 7, 8 తేదీల్లో జరిగే విచారణకు ప్రభావతి విచారణాధికారి ముందు హాజరుకావాల్పిందేనని తేల్చి చెప్పింది. విచారణకు సహకరించకపోతే మధ్యంతర రక్షణ రద్దు అవుతుందని హెచ్చరించింది.
కాగా వైసీపీ హయాంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు రఘురామపై సీఐడీ కేసు నమోదు అయింది. ఈ మేరకు ఆయనను అరెస్ట్ చేసి కస్డడీ తీసుకున్న సమయంలో కస్టోడియల్ టార్చర్ జరిగింది. కాళ్లు చేతులపై దీంతో ఆయన ఫిర్యాదు చేయడంతో వైద్య పరీక్షలకు గుంటూరు జీజీహెచ్ ఆస్పత్రికి తరలించారు. అయితే వైద్య పరీక్షలు చేసి ఎలాంటి గాయాలు లేవని సర్టిఫికెట్ ఇచ్చారు. దీంతో ఆ కేసులో రఘురామకు ఎదురు దెబ్బ తగిలింది.
అయితే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో సీఐడీకి రఘురామ కృష్ణంరాజు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేశారు. దీంతో ప్రభావతి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. హైకోర్టులో ెఎదురుదెబ్బ తగలడంతో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో రఘు రామ రాజు కూడా తన వాదననలను సైతం పరిగణనలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో సుప్రీంకోర్టు తాజాాగా విచారణ చేపట్టింది. ఇందులో భాగంగా ప్రభావతికి న్యాయమూర్తి కీలక ఆదేశాలు జారీ చేశారు.