ఉద్యోగులకు జీతం రెండు విడతల్లో ఇస్తాం: జగన్

కరోనా వైరస్ ప్రజల ఆరోగ్యంతో పాటు దేశ, రాష్ట్ర ఆర్థిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈనెల 22 నుంచి దేశం, రాష్ట్రం స్థంభించిపోయింది. ఎమర్జెన్సీ సర్వీసులు మినహా ఒక్క వ్యవస్ధ కూడా పని చేయడం లేదు. రాష్ట్ర విభజన నాటి నుంచి అప్పుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఆర్థిక స్థితి మరింత దిగజారిపోయింది. కరోనా నేపథ్యంలో ఏపీ ఆర్థిక వ్యవస్థ వెంటిలేటర్ మీద నడుస్తోంది. బడ్జెట్ ప్రవేశపెట్టే పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం […]

Update: 2020-03-31 05:23 GMT

కరోనా వైరస్ ప్రజల ఆరోగ్యంతో పాటు దేశ, రాష్ట్ర ఆర్థిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈనెల 22 నుంచి దేశం, రాష్ట్రం స్థంభించిపోయింది. ఎమర్జెన్సీ సర్వీసులు మినహా ఒక్క వ్యవస్ధ కూడా పని చేయడం లేదు. రాష్ట్ర విభజన నాటి నుంచి అప్పుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఆర్థిక స్థితి మరింత దిగజారిపోయింది.

కరోనా నేపథ్యంలో ఏపీ ఆర్థిక వ్యవస్థ వెంటిలేటర్ మీద నడుస్తోంది. బడ్జెట్ ప్రవేశపెట్టే పరిస్థితి లేదు. అలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం దారుణంగా పడిపోయింది. దీంతో ఉద్యోగుల వేతనాలు కూడా చెల్లించలేని స్థితికి చేరుకుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రెండు విడతలుగా జీతం చెల్లిస్తామని ఏపీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తెలిపారు.

ఏపీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడితో భేటీ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కరోనాతో రాష్ట్ర ఆర్థిక పరిస్ధితి దెబ్బతిన్న నేపథ్యంలో ఈ నెలలో సగం జీతం ఇస్తామని, మిగిలిన సగం జీతం నిధులు సర్దుబాటు అయ్యాక ఇస్తామని చెప్పారు. ఈ విపత్కర పరిస్థితుల్లో ఉద్యోగులు సహకరించాలని ఆయన కోరారు. దానికి ఉద్యోగ సంఘాలు కూడా అంగీకరించాయి.

Tags: andhrapradesh, employees, salaries, two instalments

Tags:    

Similar News