భూముల స్వాధీనంపై అమరరాజా గ్రూప్ షాకింగ్ కామెంట్స్
దిశ, వెబ్‌డెస్క్: అమరరాజా కంపెనీ భూములను ఏపీ ప్రభుత్వం తిరిగి తీసుకున్న విషయంలో ఎట్టకేలకు ఆ కంపెనీ గురువారం స్పందించింది. తమకు ఎలాంటి అధికారిక సమాచారం గానీ, నోటీసులు రాలేదని ఆ సంస్థ ప్రతినిధులు ప్రకటించారు. అమరరాజా సంస్థ ప్రారంభించినప్పటి నుంచి చిత్తూరులో ఉపాధి అవకాశాలు సృష్టించామని, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం అనే లక్ష్యాన్ని కొనసాగిస్తున్నామని, భవిష్యత్‌లోనూ అది కొనసాగుతూనే ఉంటుందని ఆ సంస్థ స్పష్టం చేసింది. ప్రభుత్వ నియమ నిబంధనలకు, తమ కంపెనీ నియమాలకు […]
దిశ, వెబ్‌డెస్క్: అమరరాజా కంపెనీ భూములను ఏపీ ప్రభుత్వం తిరిగి తీసుకున్న విషయంలో ఎట్టకేలకు ఆ కంపెనీ గురువారం స్పందించింది. తమకు ఎలాంటి అధికారిక సమాచారం గానీ, నోటీసులు రాలేదని ఆ సంస్థ ప్రతినిధులు ప్రకటించారు. అమరరాజా సంస్థ ప్రారంభించినప్పటి నుంచి చిత్తూరులో ఉపాధి అవకాశాలు సృష్టించామని, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం అనే లక్ష్యాన్ని కొనసాగిస్తున్నామని, భవిష్యత్‌లోనూ అది కొనసాగుతూనే ఉంటుందని ఆ సంస్థ స్పష్టం చేసింది. ప్రభుత్వ నియమ నిబంధనలకు, తమ కంపెనీ నియమాలకు తప్పనిసరిగా ప్రాధాన్యత ఇస్తామని అమరరాజా గ్రూప్ కార్పొరేట్ కమ్యూనికేషన్స్ ప్రకటించింది.
అయితే, గత పదేండ్ల కిందట 483 ఎకరాలను వ్యాపార విస్తరణ కింద వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం కేటాయించింది. సరిగ్గా పదేండ్లు గడిచాక అమరరాజా కంపెనీకి ఇచ్చిన భూములను సద్వినియోగం చేసుకోలేదని, మాట తప్పిందని పేర్కొంటూ 253 ఎకరాల భూమిని జగన్ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఈ కంపెనీ గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌కు చెందినది కావడంతో వైసీపీ ప్రభుత్వం కావాలనే కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతోందని తెలుగుదేశం నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అమరరాజా గ్రూప్ ప్రతినిధులు తమ సంస్థకు చెందిన భూమని ఏపీ ప్రభుత్వం వెనక్కి తీసుకుందని సామాజిక మాద్యమాల ద్వారా తెలుసుకున్నామని, కానీ ఎలాంటి అధికారిక సమాచారం అందలేదని తెలపడం గమనార్హం.