ప్రతిఒక్కరినీ పరీక్షిస్తాం : మంత్రి బొత్స
ఏపీలో కరోనా నివారణకు సీఎం జగన్మోహన్‌రెడ్డి అనేక చర్యలు తీసుకుంటున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ప్రపంచం, దేశం కరోనా రావొద్దని కోరుకుంటుంటే టీడీపీ నాయకులు మాత్రం ఏపీకి రావాలని అనుకుంటున్నారని విమర్శించారు. మర్కజ్ ప్రార్థనలకు హాజరైన వారు, వారితో కాంటాక్ట్ అయిన ప్రతి ఒక్కరికీ పూర్తిస్థాయిలో పరీక్షలు చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారని తెలిపారు. పోలీసులు, వైద్య సిబ్బంది, క్షేత్రస్థాయి సర్వే డేటాను విశ్లేషించుకుని వైద్య పరీక్షల విషయంలో వ్యూహం ప్రకారం ముందుకు వెళ్తున్నామన్నారు. […]
ఏపీలో కరోనా నివారణకు సీఎం జగన్మోహన్‌రెడ్డి అనేక చర్యలు తీసుకుంటున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ప్రపంచం, దేశం కరోనా రావొద్దని కోరుకుంటుంటే టీడీపీ నాయకులు మాత్రం ఏపీకి రావాలని అనుకుంటున్నారని విమర్శించారు. మర్కజ్ ప్రార్థనలకు హాజరైన వారు, వారితో కాంటాక్ట్ అయిన ప్రతి ఒక్కరికీ పూర్తిస్థాయిలో పరీక్షలు చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారని తెలిపారు. పోలీసులు, వైద్య సిబ్బంది, క్షేత్రస్థాయి సర్వే డేటాను విశ్లేషించుకుని వైద్య పరీక్షల విషయంలో వ్యూహం ప్రకారం ముందుకు వెళ్తున్నామన్నారు. ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లిన 946 మందిని గుర్తించామని, 881 మందికి ఇప్పటికే వైద్య పరీక్షలు పూర్తయి ఫలితాలు వచ్చాయని, వీరిలో 108 మందికి కరోనా నిర్ధారణ అయిందని వివరించారు.
Tags: medical, check up, everyone, minister botsa satyanarayana, coronavirus