గుజరాత్ నుంచి 5 వేల మందిని తెప్పిస్తున్నాం: మోపిదేవి

గుజరాత్‌లో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ మత‍్స్యకారులను రాష్ట్రానికి రప్పిస్తున్నామని మత్స్యకార శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ ప్రకటించారు. విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి గుజరాత్ ముఖ్యమంత్రికి ఫోన్ చేసి ఆ రాష్ట్రంలో చిక్కుకుపోయిన మత్స్యకారులతో పాటు ఇతరులపై శ్రద్ధ చూపించాలని కోరడంతో ఆయన అంగీకరించారని చెప్పారు. ఈ క్రమంలో గుజరాత్‌లో చిక్కుకుపోయిన 5,000 మంది ఆంధ్రప్రదేశ్ మత్స్యకారులను రోడ్డు మార్గం గుండా తరలించేందుకు ఇబ్బంది అవుతుందని చెప్పడంతో.. వారిని తరలించేందుకు సముద్ర మార్గం సరైనదని […]

Update: 2020-04-23 02:30 GMT

గుజరాత్‌లో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ మత‍్స్యకారులను రాష్ట్రానికి రప్పిస్తున్నామని మత్స్యకార శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ ప్రకటించారు. విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి గుజరాత్ ముఖ్యమంత్రికి ఫోన్ చేసి ఆ రాష్ట్రంలో చిక్కుకుపోయిన మత్స్యకారులతో పాటు ఇతరులపై శ్రద్ధ చూపించాలని కోరడంతో ఆయన అంగీకరించారని చెప్పారు. ఈ క్రమంలో గుజరాత్‌లో చిక్కుకుపోయిన 5,000 మంది ఆంధ్రప్రదేశ్ మత్స్యకారులను రోడ్డు మార్గం గుండా తరలించేందుకు ఇబ్బంది అవుతుందని చెప్పడంతో.. వారిని తరలించేందుకు సముద్ర మార్గం సరైనదని అధికారులు సూచించారని, దీంతో వారందర్నీ సముద్ర మార్గం ద్వారా ఏపీకి తరలించేందుకు గుజరాత్ సీఎం కూడా అంగీకరించడంతో వారిని త్వరలోనే సముద్రమార్గంలో తీసుకొస్తామని ఆయన తెలిపారు.

Tags: ap, fishermen, gujarath, north costel andhra, mopidevi venkatramana

Tags:    

Similar News