అయ్యో.. అంటూ వాళ్లు ఆవేదన చెందుతున్రు

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: ఒక్కసారిగా కురిసిన వర్షం కారణంగా జిల్లాలో పలు చోట్ల పంటపొలాలో నీరు నిలిచి రైతులు తీవ్రంగా నష్ట పోయే పరిస్థితి నెలకొంది. మిడ్జిల్ మండలంలో రాత్రి భారీగా కురిసిన వర్షంతో ఇటీవల వేసిన పత్తి పంట పూర్తిగా నీట మునిగింది. ఇప్పుడిపుడే పంట మొలకెత్తుతున్న సమయంలో వర్షం కురవడంతో నిలిచిన నీరు కారణంగా పంట పూర్తిగా దెబ్బతిన్నది. అదేవిధంగా రెండుమూడు రోజులుగా వేస్తున్న విత్తనాలు రాత్రి కురిసిన వర్షం దెబ్బకు మొలకేతే […]

Update: 2020-07-02 21:51 GMT

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: ఒక్కసారిగా కురిసిన వర్షం కారణంగా జిల్లాలో పలు చోట్ల పంటపొలాలో నీరు నిలిచి రైతులు తీవ్రంగా నష్ట పోయే పరిస్థితి నెలకొంది. మిడ్జిల్ మండలంలో రాత్రి భారీగా కురిసిన వర్షంతో ఇటీవల వేసిన పత్తి పంట పూర్తిగా నీట మునిగింది. ఇప్పుడిపుడే పంట మొలకెత్తుతున్న సమయంలో వర్షం కురవడంతో నిలిచిన నీరు కారణంగా పంట పూర్తిగా దెబ్బతిన్నది. అదేవిధంగా రెండుమూడు రోజులుగా వేస్తున్న విత్తనాలు రాత్రి కురిసిన వర్షం దెబ్బకు మొలకేతే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. తమను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

Tags:    

Similar News