నిరీక్షిస్తున్నా.. కనికరిస్తలేరు : కలెక్టర్ కు రిక్వెస్ట్

దిశ, కాటారం: అష్టకష్టాలు పడి వరి సాగు చేసిన రైతులు పంటను అమ్ముకునేందుకు ముప్పు తిప్పలు పడాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శ్రమించి ధాన్యం పండించిన రైతులు అమ్ముకోవాలి అంటే ప్రతిసారి కష్టాలు తప్పడం లేదు. ఈసారి కాటారం సబ్ డివిజన్ పరిధిలో ఐదు మండలాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించలేదు. ప్రతిపాదిత కొనుగోలు కేంద్రాల్లో రైతులు ధాన్యం కుప్పలు పోశారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించక పోవడంతో అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారు. పెరిగిన వరి […]

Update: 2021-11-09 22:32 GMT

దిశ, కాటారం: అష్టకష్టాలు పడి వరి సాగు చేసిన రైతులు పంటను అమ్ముకునేందుకు ముప్పు తిప్పలు పడాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శ్రమించి ధాన్యం పండించిన రైతులు అమ్ముకోవాలి అంటే ప్రతిసారి కష్టాలు తప్పడం లేదు. ఈసారి కాటారం సబ్ డివిజన్ పరిధిలో ఐదు మండలాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించలేదు. ప్రతిపాదిత కొనుగోలు కేంద్రాల్లో రైతులు ధాన్యం కుప్పలు పోశారు. కొనుగోలు కేంద్రాలు ప్రారంభించక పోవడంతో అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారు.

పెరిగిన వరి సాగు విస్తీర్ణం…

ఈ ఏడాది వాన కాలంలో భారీ వర్షాలు కురవక జలవనరుల్లోకి సమృద్ధిగా నీరు వచ్చి చేరడంతో భూగర్భ జల మట్టం పెరిగింది. దీంతో అన్నదాతలు రికార్డు స్థాయిలో వరి సాగు చేపట్టారు. కాటారం, మలహర్, మహాముత్తారం, మహాదేవపూర్, పలిమెల మండలాల్లో 47,045 ఎకరాల్లో ఈ ఏడాది వరి సాగు విస్తీర్ణం చేశారు. ఈ సాగు ద్వారా 11,76,875 క్వింటాళ్ల వరిధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. పంట చేతికొచ్చినా ఎక్కడ అమ్మాలో తెలియక కర్షకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పీఏసీఎస్, ఐకేపే అధికారులు ధాన్యం కొనుగోలు కేంద్రాలు నేటికీ ప్రారంభించేందుకు ముందుకు రాకపోవడంతో ఏం చేయాలో తెలియక రైతులు అవస్థలు పడుతున్నారు.

దళారులకే ధాన్యం విక్రయం…

వరి ధాన్యం పంట చేతికందినా కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో రైతులు తమ అవసరాల నిమిత్తం గ్రామాల్లో ధాన్యం దళారులకే తక్కువ ధరకు విక్రయిస్తున్నారు. మద్దతు ధర లభించకపోగా రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. రైతులు ధాన్యాన్ని గ్రామాల్లో క్వింటాల్ ధాన్యాన్ని రూ. 1200 నుంచి రూ. 1300 కే విక్రయిస్తున్నారు. కాటారం మండలంలోని దేవరంపల్లి రేగుల గూడెం ప్రతిపాదిత ధాన్యం కొనుగోలు కేంద్రాల స్థలాల్లో రైతులు ధాన్యం కుప్పలు పోసి కొనుగోలు కేంద్రాలు ఎప్పుడు ప్రారంభిస్తారోనని నిరీక్షిస్తున్నారు. కాటారం మండలంలో 21 కొనుగోలు కేంద్రాలు ప్రతిపాదించగా ఏ గ్రామంలోనూ కేంద్రాలు ప్రారంభించలేదు. కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి తమ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని రైతులు జిల్లా కలెక్టర్ కు విజ్ఞప్తి చేశారు.

Tags:    

Similar News