మసీదు ప్రార్థనల్లో 5గురికి మించొద్దు: తెలంగాణ వక్ఫ్ బోర్డు ఆదేశాలు

దిశ, న్యూస్ బ్యూరో: తెలంగాణలో కరోనా వ్యాప్తిని నిరోధించడానికి ముస్లింలు శుక్రవారం ప్రార్థనలు ఇళ్లలోనే చేసుకోవాలని తెలంగాణ స్టేట్ వక్ఫ్ బోర్డు కోరింది. ఈ మేరకు గురువారం తెలంగాణ వక్ఫ్ బోర్డు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇస్లాం ప్రకారం మసీదులు శుక్రవారం ప్రార్థనలు పూర్తిగా లేకుండా ఉండకూడదని, 5గురు మించకుండా మసీదుకు వెళ్లి ప్రార్థన చేసుకోవాలని సూచించింది. మసీదుల్లో ప్రార్థనలు ముఖ్యమైనప్పటికీ అంతకంటే విలువైన మనుషుల ప్రాణాలకు ముస్లింల వల్ల నష్టం జరగకూడదని హైదరాబాద్ జామియా […]

Update: 2020-03-26 10:32 GMT

దిశ, న్యూస్ బ్యూరో: తెలంగాణలో కరోనా వ్యాప్తిని నిరోధించడానికి ముస్లింలు శుక్రవారం ప్రార్థనలు ఇళ్లలోనే చేసుకోవాలని తెలంగాణ స్టేట్ వక్ఫ్ బోర్డు కోరింది. ఈ మేరకు గురువారం తెలంగాణ వక్ఫ్ బోర్డు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇస్లాం ప్రకారం మసీదులు శుక్రవారం ప్రార్థనలు పూర్తిగా లేకుండా ఉండకూడదని, 5గురు మించకుండా మసీదుకు వెళ్లి ప్రార్థన చేసుకోవాలని సూచించింది. మసీదుల్లో ప్రార్థనలు ముఖ్యమైనప్పటికీ అంతకంటే విలువైన మనుషుల ప్రాణాలకు ముస్లింల వల్ల నష్టం జరగకూడదని హైదరాబాద్ జామియా నిజామియా యూనివర్సిటీ ఇచ్చిన ఫత్వాను వక్ఫ్ బోర్డు ఈ సందర్భంగా కోట్ చేసింది.

Tags : telangana, corona, mosque prayers, restrictions

Tags:    

Similar News