డ్రగ్స్ కేసు నుంచి వాంఖడే ఔట్.. దర్యాప్తుకు జాతీయ స్థాయి సిట్..
దిశ, వెబ్‌డెస్క్: ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు విచారణలో అవినీతి అరోపణలు ఎదుర్కొంటున్న ముంబై ఎన్సీబీ అధికారి సమీర్ వాంఖడేపై కేంద్రం వేటు వేసింది. కేసును సీనియర్ పోలీస్ అఫీసర్ సంజయ్ సింగ్ నేతృత్వంలోని ప్రత్యేక టీంకు బదిలీ చేసింది. ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసుతో పాటు వాంఖడే దర్యాప్తు చేస్తున్న మరో ఐదు కేసులను సంజయ్‌కు అప్పగించింది. అయితే ఏ అధికారిని కూడా వారి ప్రస్తుత బాధ్యతల నుంచి తొలగించట్లేదని ఎన్సీబీ నొక్కి చెప్పింది. దీనిపై […]
దిశ, వెబ్‌డెస్క్: ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు విచారణలో అవినీతి అరోపణలు ఎదుర్కొంటున్న ముంబై ఎన్సీబీ అధికారి సమీర్ వాంఖడేపై కేంద్రం వేటు వేసింది. కేసును సీనియర్ పోలీస్ అఫీసర్ సంజయ్ సింగ్ నేతృత్వంలోని ప్రత్యేక టీంకు బదిలీ చేసింది. ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసుతో పాటు వాంఖడే దర్యాప్తు చేస్తున్న మరో ఐదు కేసులను సంజయ్‌కు అప్పగించింది. అయితే ఏ అధికారిని కూడా వారి ప్రస్తుత బాధ్యతల నుంచి తొలగించట్లేదని ఎన్సీబీ నొక్కి చెప్పింది.
దీనిపై స్పందించిన సమీర్ వాంఖడే తనను ఉద్యోగంలో నుంచి తొలగించలేదని స్పష్టం చేశారు. ‘నన్ను దర్యాప్తు నుంచి తొలగించలేదు. ఈ కేసులో విచారణ కోసం జాతీయ స్థాయి సంస్థ జోక్యం చేసుకోవాలని బాంబే హైకోర్టుకు నేను లేఖ రాశాను. దాని ఆధారంగానే సీనియర్ అధికారి అధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఏర్పాటు చేశారు’ అని జాతీయ మీడియాకు వెల్లడించారు. ఈ కేసులకు అంతర్జాతీయ కనెక్షన్లు ఉన్న కారణంగానే కేసుల బదిలీ జరిగినట్టు ఏజెన్సీ వర్గాలు చెబుతున్నాయి.