షాకింగ్.. పెండ్లి వాహనాన్ని కిలో మీటర్ తరిమిన పెద్దపులి..!
దిశ, మహాదేవపూర్: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గత కొన్ని రోజులుగా పెద్దపులి సంచరిస్తూ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తోంది. పులి ఎప్పుడు గ్రామాల్లోకి వచ్చి దాడి చేస్తుందోనని గ్రామ పరిసర ప్రాంతాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఇటీవల గేదెలు, పశువుల మంద పై దాడి చేసిన విషయం తెలిసిందే. కాగా తాజాగా సోమవారం ఓ పెళ్లి బృందం వెళుతున్న వాహనం వెంట పడడం స్థానికంగా కలకలం రేపింది. మంచిర్యాల జిల్లాకు చెందిన పెళ్లి బృందం టాటా ఏసీ […]
దిశ, మహాదేవపూర్: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గత కొన్ని రోజులుగా పెద్దపులి సంచరిస్తూ ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తోంది. పులి ఎప్పుడు గ్రామాల్లోకి వచ్చి దాడి చేస్తుందోనని గ్రామ పరిసర ప్రాంతాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఇటీవల గేదెలు, పశువుల మంద పై దాడి చేసిన విషయం తెలిసిందే. కాగా తాజాగా సోమవారం ఓ పెళ్లి బృందం వెళుతున్న వాహనం వెంట పడడం స్థానికంగా కలకలం రేపింది.
మంచిర్యాల జిల్లాకు చెందిన పెళ్లి బృందం టాటా ఏసీ వాహనంలో వెళ్తుండగా చండ్రు పల్లి సమీపంలో పెద్ద పులి వాహనం వెంట పడి సుమారు కిలోమీటర్ వరకు తరిమి నట్లు సమాచారం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలోని కాళేశ్వరం, అన్నారం గ్రామాల మార్గమధ్యలో చండ్రుపల్లి ఏరియా రాంప్ ( కెనాల్ )వద్ద పెద్దపులి పలువురిని భయబ్రాంతులకు గురి చేసింది. ఈ విషయాన్ని వారు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో అటవీశాఖ అధికారులు అక్కడికి చేరుకొని పులి పాదముద్రల ఆనవాళ్లను సేకరించారు. పులి సంచరిస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మహాదేవపూర్ మండలం కుంట్లం గ్రామం వద్ద గోదావరి నది దాటి మంచిర్యాల జిల్లా బోరెంపల్లి గ్రామం వైపుగా పులి వెళ్ళినట్టు అటవీశాఖ అధికారులు తెలిపారు.