భారత్‌కు ఆక్సిజన్ సహా ఇతర పరికరాలను విరాళంగా ఇవ్వనున్న వాల్‌మార్ట్

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో దారుణంగా పెరిగిపోతున్న కరోనా సెకెండ్ వేవ్‌ను నియంత్రించేందుకు అంతర్జాతీయ టెక్ దిగ్గజాలు ముందుకొస్తున్నాయి. ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజ గ్రూప్ సంస్థ వాల్‌మార్ట్, వాల్‌మార్ట్ ఫౌండేషన్, ఫ్లిప్‌కార్ట్, ఫోన్‌పేతో పాటు వాల్‌మార్ట్ గ్లోబల్ టెక్నాలజీ, సోర్సింగ్ హబ్‌లు కలిసి భారత్‌లో ఆక్సిజన్ కొరతను తీర్చేందుకు భాగస్వామ్యం అవుతున్నట్టు వెల్లడించాయి. ఇందులో భాగంగా ఆక్సిజన్‌ను అందించడంతో పాటు టీకా పంపిణీకి మద్దతుగా సంస్థలకు విరాళం ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. భారత్‌లో ఆక్సిజన్ కొరతను తీర్చేందుకు అంతర్జాతీయంగా వాల్‌మార్ట్ […]

Update: 2021-04-30 03:28 GMT

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో దారుణంగా పెరిగిపోతున్న కరోనా సెకెండ్ వేవ్‌ను నియంత్రించేందుకు అంతర్జాతీయ టెక్ దిగ్గజాలు ముందుకొస్తున్నాయి. ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజ గ్రూప్ సంస్థ వాల్‌మార్ట్, వాల్‌మార్ట్ ఫౌండేషన్, ఫ్లిప్‌కార్ట్, ఫోన్‌పేతో పాటు వాల్‌మార్ట్ గ్లోబల్ టెక్నాలజీ, సోర్సింగ్ హబ్‌లు కలిసి భారత్‌లో ఆక్సిజన్ కొరతను తీర్చేందుకు భాగస్వామ్యం అవుతున్నట్టు వెల్లడించాయి. ఇందులో భాగంగా ఆక్సిజన్‌ను అందించడంతో పాటు టీకా పంపిణీకి మద్దతుగా సంస్థలకు విరాళం ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాయి.

భారత్‌లో ఆక్సిజన్ కొరతను తీర్చేందుకు అంతర్జాతీయంగా వాల్‌మార్ట్ వ్యాపారాలను నిర్వహిస్తున్న సంస్థలు, ఇతర సంస్థలతో కలిసి ఆక్సిజన్ కాన్సంట్రేషన్, ఇతర పరికరాలను సేకరించేందుకు కృష్టి చేస్తున్నాయి. అలాగే ఆక్సిజన్ స్టోరేజ్, రవాణా కోసం 20 ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లు, 20 క్రయోజనిక్ కంటైనర్లను కంపెనీ విరాళంగా ఇవ్వనుంది. అంతేకాకుండా ఇళ్లలో, ఆసుపత్రులలో కరోనా బారిన పడిన వారికి ఆక్సిజన్ అందించేందుకు 3,000కి పైగా ఆక్సిజన్ కాన్సంట్రేషన్, 500 ఆక్సిజన్ సిలిండర్లను విరాళంగా ఇవ్వనుంది. వీటి పంపిణీ కోసం ఆసుపత్రులు, స్వచ్ఛంద సంస్థలతో భాగస్వామ్యం చేసుకోనున్నట్టు కంపెనీ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇవి కాకుండా అమెరికా-ఇండియా బిజినెస్ కౌన్సిల్ ఇతర ఫోరమ్‌లు కలిసి చేస్తున్న ఉమ్మడి సహాయక చర్యల్లో భాగంగా వాల్‌మార్ట్, వాల్‌మార్ట్ ఫౌండేషన్ అదనంగా 2,500 ఆక్సిజన్ కాన్సంట్రేషన్‌లాకు నిధులను సమకూర్చనున్నాయి.

Tags:    

Similar News