హ్యాట్సాఫ్… విలేజ్ వారియర్స్: రోజా
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుపేదలను, వృద్ధులను దృష్టిలో ఉంచుకుని అందజేస్తున్న పింఛను పథకం లబ్ధిదారులకు నగదు పంపణీ చేసిన సంగతి తెలిసిందే. కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో నేటి ఉదయం 9 గంటలలోపు గ్రామ వాలంటీర్లు సుమారు 69 శాతం మంది లబ్దిదారులకు అందజేశారు. అందిస్తున్నారు. వాస్తవానికి ఈ పధకాలు థంబ్ ఇంప్రెషన్‌తో నమోదు చేయాల్సి ఉన్నప్పటికీ.. ఫొటో గుర్తింపుతో పింఛన్లు అందజేశారు. ఈ నేపథ్యంలో వాలంటీర్ల సేవలను వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా కొనియాడారు. ‘దేశం మొత్తం లాక్‌డౌన్‌లో […]
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుపేదలను, వృద్ధులను దృష్టిలో ఉంచుకుని అందజేస్తున్న పింఛను పథకం లబ్ధిదారులకు నగదు పంపణీ చేసిన సంగతి తెలిసిందే. కరోనా వైరస్ విజృంభణ నేపథ్యంలో నేటి ఉదయం 9 గంటలలోపు గ్రామ వాలంటీర్లు సుమారు 69 శాతం మంది లబ్దిదారులకు అందజేశారు. అందిస్తున్నారు. వాస్తవానికి ఈ పధకాలు థంబ్ ఇంప్రెషన్‌తో నమోదు చేయాల్సి ఉన్నప్పటికీ.. ఫొటో గుర్తింపుతో పింఛన్లు అందజేశారు.
ఈ నేపథ్యంలో వాలంటీర్ల సేవలను వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రోజా కొనియాడారు. ‘దేశం మొత్తం లాక్‌డౌన్‌లో ఉన్నవేళ.. ప్రజలంతా ఇంట్లోనే ఉంటూ కొవిడ్-19తో పోరాడుతుంటే, మన ఏపీ విలేజ్ వారియర్స్ మాత్రం.. ఇబ్బందులు పడుతున్న వారికి సాయం అందించే పనిలో నిమగ్నమయ్యారు. హ్యాట్సాఫ్ టు వాలంటీర్స్.. పింఛనులను డోర్ డెలివరీ చేస్తూ గొప్ప సేవలు అందిస్తున్నారు’ అంటూ ట్వీట్టర్ మాధ్యమంగా వారిని అభినందించారు.
Tags: corona, lockdown, rk roja, tweet, roja, twitter, ysrcp, volunteers