భారీగా ఛార్జీలు పెంచాలని వొడాఫోన్ ఐడియా ప్లాన్!?

దిశ, వెబ్‌డెస్క్ : టెలికాం వినియోగదారులకు వొడాఫోన్ ఐడియా షాక్ ఇవ్వనుంది. టెలికాం విభాగానికి చెల్లించాల్సిన స్థూల రాబడి సర్దుబాటు(ఏజీఆర్) చెల్లింపులతో దివాలా తీసే స్థితిలో వొడాఫోన్ ఐడియా సంస్థ పడిపోయింది. ఈ పతనం నుంచి కోలుకోవడానికి కాల్ ఛార్జీలను, మొబైల్ డాటాలను సవరించాలని కోరుతోంది. కాల్ ఛార్జీలను 8 రెట్లు, డాటా ఛార్జీలను 7 రెంట్లు పెంచాలని భావిస్తోంది. ఈ సవరణలకు సంబంధించి టెలికాం విభాగానికి లేఖ కూడా రాసింది. ప్రస్తుత ఛార్జీలను సవరించి, ఔట్ […]

Update: 2020-03-01 03:28 GMT

దిశ, వెబ్‌డెస్క్ : టెలికాం వినియోగదారులకు వొడాఫోన్ ఐడియా షాక్ ఇవ్వనుంది. టెలికాం విభాగానికి చెల్లించాల్సిన స్థూల రాబడి సర్దుబాటు(ఏజీఆర్) చెల్లింపులతో దివాలా తీసే స్థితిలో వొడాఫోన్ ఐడియా సంస్థ పడిపోయింది. ఈ పతనం నుంచి కోలుకోవడానికి కాల్ ఛార్జీలను, మొబైల్ డాటాలను సవరించాలని కోరుతోంది. కాల్ ఛార్జీలను 8 రెట్లు, డాటా ఛార్జీలను 7 రెంట్లు పెంచాలని భావిస్తోంది. ఈ సవరణలకు సంబంధించి టెలికాం విభాగానికి లేఖ కూడా రాసింది.

ప్రస్తుత ఛార్జీలను సవరించి, ఔట్ గోయింగ్ ఛార్జీలను నిమిషానికి 6 పైసలు, డాటా ఛార్జీలను ఒక జీబీకి రూ. 35 లు ఉండేలా నిర్ణయించాలని టెలికాం విభాగానికి ఇచ్చిన లేఖలో పేర్కొంది. అంతేకాకుండా నెలకు కనీస ఛార్జీ రూ. 50 చేయాలని ప్రతిపాదనలు ఇచ్చింది. ఈ సవరణలు ఏజీఆర్ చెల్లించడానికి వీలుగా ఏప్రిల్ 1 నుంచి రేట్లను అమలు చేయాలని చెప్పింది. గత కొన్నేళ్లుగా మార్కెట్ వాటా తగ్గడంతో పాటు, ప్రభుత్వానికి ఏజీఆర్ చెల్లించాల్సి రావడంతో సంస్థ కేవలం వారాల వ్యవధిలోనే భారీ నష్టాలను ఎదుర్కొందని, కంపెనీకి ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయని తెలిపింది. వొడాఫోన్ ఐడియా ఏజీఆర్ బకాయిల కింద టెలికాం విభాగానికి మొత్తం రూ. 53,000 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇప్పటివరకు రూ. 3,500 కోట్లు చెల్లించింది.

Tags:    

Similar News