రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైంది : రాష్ట్ర మహిళా కాంగ్రెస్‌ ఉపాధ్యక్షురాలు మాధవి రెడ్డి

దిశ,పాలేరు: మహిళలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్‌ ఉపాధ్యక్షురాలు రామసహయం మాధవిరెడ్డి అన్నారు. ఆదివారం నల్గొండ జిల్లాలో లైంగిక దాడికి గురైన బాధితురాలి కుటుంబాన్ని ఆమె పరామర్శించినట్లు కూసుమంచి మండలం పాలేరు గ్రామంలోని ఆమె నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలన్నారు. ఇలాంటి దాడులపై కాంగ్రెస్‌ ప్రభుత్వం మహిళ రక్షణ కోసం నిర్భయ చట్టాన్ని తేచ్చిందన్నారు. మహిళ రక్షణకు […]

Update: 2021-09-26 05:48 GMT

దిశ,పాలేరు: మహిళలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్‌ ఉపాధ్యక్షురాలు రామసహయం మాధవిరెడ్డి అన్నారు. ఆదివారం నల్గొండ జిల్లాలో లైంగిక దాడికి గురైన బాధితురాలి కుటుంబాన్ని ఆమె పరామర్శించినట్లు కూసుమంచి మండలం పాలేరు గ్రామంలోని ఆమె నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలన్నారు. ఇలాంటి దాడులపై కాంగ్రెస్‌ ప్రభుత్వం మహిళ రక్షణ కోసం నిర్భయ చట్టాన్ని తేచ్చిందన్నారు. మహిళ రక్షణకు తమ పార్టీ కఠినంగా వ్యవహరించిందన్నారు. విచారణలో ఎక్కడా కూడా నిర్లక్ష్యం వహించవద్దని, నిందితులెంతటివారైనా శిక్షపడేలా చేయాలని డిమాండ్‌ చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేవరకూ తాము పోరాడుతామని తెలిపారు. మహిళలు పట్ల జరుగుతున్న దాడులపై చొరవచూపాలని, ఇలాంటి సంఘటనలు పునరావృతమవకుండా చర్యలు తీసుకోవాలన్నారు.

Tags:    

Similar News