నల్లపోచమ్మ ఆలయాన్ని పున:నిర్మించాలి

దిశ, న్యూస్‌బ్యూరో: సచివాలయం కూల్చివేతలో కోల్పోయిన నల్లపోచమ్మ దేవాలయాన్ని పున:నిర్మించాలని కోరుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు విశ్వహిందూ పరిషత్ బహిరంగ లేఖ రాసింది. ఈ లేఖలో సచివాలయం కూల్చివేత సందర్భంగా నల్లపోచమ్మ దేవాలయం, పురాతన శివాలయం, గ్రామదేవత ఆలయం కోల్పోవడం జరిగిందని వాటిని తిరిగి శాస్త్ర ప్రకారంగా నిర్మించాలని కోరింది. కూల్చివేతకు కారణమైన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. ఆలయాల నిర్మాణ కార్యాచరణకై ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని విశ్వహిందూ పరిషత్ కోరింది.

Update: 2020-09-05 10:54 GMT

Tags:    

Similar News