వెంటనే ఆర్డినెన్స్ తేవాలి.. ప్రభుత్వానికి VHP హెచ్చరిక

దిశ ప్రతినిధి, హైదరాబాద్: గణేష్ ఉత్సవాలపై తెలంగాణ హైకోర్టు విధించిన ఆంక్షలు ఎత్తివేయడానికి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆర్డినెన్స్ తీసుకురావాలని విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేసింది. బుధవారం కోఠిలోని విశ్వహిందూ పరిషత్ కార్యాలయంలో వీహెచ్‌పీ తెలంగాణ ప్రాంత సంఘటన కార్యదర్శి ముదుపు యాదిరెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు రామరాజు, ప్రతినిధి శశిధర్‌లు మీడియాతో మాట్లాడుతూ… గణేష్ ఉత్సవాలపై హైకోర్టు విధించిన ఆంక్షలు ఎత్తి వేయడానికి న్యాయస్థానం ముందు ప్రభుత్వం ఉద్దేశ్య పూర్వకంగానే సరైన వాదనలు వినిపించలేదని, ఎంఐఎం […]

Update: 2021-09-15 07:33 GMT

దిశ ప్రతినిధి, హైదరాబాద్: గణేష్ ఉత్సవాలపై తెలంగాణ హైకోర్టు విధించిన ఆంక్షలు ఎత్తివేయడానికి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆర్డినెన్స్ తీసుకురావాలని విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేసింది. బుధవారం కోఠిలోని విశ్వహిందూ పరిషత్ కార్యాలయంలో వీహెచ్‌పీ తెలంగాణ ప్రాంత సంఘటన కార్యదర్శి ముదుపు యాదిరెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు రామరాజు, ప్రతినిధి శశిధర్‌లు మీడియాతో మాట్లాడుతూ… గణేష్ ఉత్సవాలపై హైకోర్టు విధించిన ఆంక్షలు ఎత్తి వేయడానికి న్యాయస్థానం ముందు ప్రభుత్వం ఉద్దేశ్య పూర్వకంగానే సరైన వాదనలు వినిపించలేదని, ఎంఐఎం ఎజెండాను ప్రభుత్వం అమలు చేస్తోందని వారు ఆరోపించారు.

హిందువుల హక్కులకు విఘాతం కలిగిస్తే జరిగే పరిణామాలకు ప్రభుత్వానిదే బాధ్యత అని హెచ్చరించారు. వెంటనే మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి హైకోర్టు ఆంక్షలు సడలించేలా ఆర్డినెన్స్ తీసుకురావాలని డిమాండ్ చేశారు. భాగ్యనగర్ సాంస్కృతిక వైభవం కాపాడుకునేందుకు గురువారం జీహెచ్ఎంసీ పరిధిలో నిరసనలు తెలుపనున్నట్లు వారు పేర్కొన్నారు. ఈ నిరసనలో హిందూ ధార్మిక, ఆధ్యాత్మిక సంస్థలు, రాజకీయ పార్టీలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో వీహెచ్‌పీ ప్రచార ప్రముఖ్ కైలాష్ పాల్గొన్నారు.

Tags:    

Similar News