వలంటీర్ కుటుంబానికి 5 లక్షల పరిహారం: జగన్

కరోనా నేపథ్యంలో విధులు నిర్వర్తిస్తూ ఆకస్మికంగా మృతి చెందిన వలంటీర్‌ కుటుంబానికి 5 లక్షల రూపాయల నష్టపరిహారం అందజేస్తామని సీఎం జగన్ ప్రకటించారు. దాని వివరాల్లో వెళ్తే… విశాఖపట్టణం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతమైన పాడేరు మండలంలోని తుంపాడ గ్రామ సచివాలయం కుజ్జెలి పంచాయతీలో పెన్షన్లు పంపిణీ చేస్తూ వలంటీర్‌ గబ్బాడ అనురాధ (26) గుండెపోటుతో మృతిచెందింది. ఈ విషాయాన్ని తెలుసుకున్న ముఖ్యమంత్రి, సీఎంఓ అధికారులతో ఫోన్లో మాట్లాడి, ఆ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఆరాతీశారు. దీంతో […]

Update: 2020-05-02 02:09 GMT

కరోనా నేపథ్యంలో విధులు నిర్వర్తిస్తూ ఆకస్మికంగా మృతి చెందిన వలంటీర్‌ కుటుంబానికి 5 లక్షల రూపాయల నష్టపరిహారం అందజేస్తామని సీఎం జగన్ ప్రకటించారు. దాని వివరాల్లో వెళ్తే… విశాఖపట్టణం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతమైన పాడేరు మండలంలోని తుంపాడ గ్రామ సచివాలయం కుజ్జెలి పంచాయతీలో పెన్షన్లు పంపిణీ చేస్తూ వలంటీర్‌ గబ్బాడ అనురాధ (26) గుండెపోటుతో మృతిచెందింది. ఈ విషాయాన్ని తెలుసుకున్న ముఖ్యమంత్రి, సీఎంఓ అధికారులతో ఫోన్లో మాట్లాడి, ఆ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఆరాతీశారు. దీంతో ఆమెకుటుంబానికి అండగా నిలుస్తామని, 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు. వెంటనే ఈ సహాయం వారి కుటుంబ సభ్యులకు అందేలా చూడాలని కలెక్టర్‌ను ఆదేశించారు. దీంతో తక్షణ సాయంగా స్థానిక ఎమ్మెల్యే పది వేల రూపాయలు వారికి అందించారు.

tags: volunteer dead, sudden death, visakhapatnam district, agency, paderu, anuradha

Tags:    

Similar News