విశాఖ స్టీల్ ప్లాంట్‌ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం : కార్మిక సంఘాలు

దిశ, ఏపీ బ్యూరో: విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో ప్రారంభమైన విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటుపరం కాకుండా చూస్తామని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నేతలు స్పష్టం చేశారు. ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుంటామన్నారు. ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయం ఉపసంహరించుకుని.. స్టీల్‌ప్లాంట్‌కు గనులు కేటాయించాలని డిమాండ్ చేశారు. కొత్త పరిశ్రమల్ని ఇవ్వకుండా ఉన్న పరిశ్రమల్ని ప్రైవేట్‌పరం చేయడం దారుణమన్నారు. ఏపీకే మణిహారంగా ఉన్న స్టీల్ ప్లాంట్‌ను […]

Update: 2021-07-24 05:12 GMT

దిశ, ఏపీ బ్యూరో: విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో ప్రారంభమైన విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటుపరం కాకుండా చూస్తామని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నేతలు స్పష్టం చేశారు. ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుంటామన్నారు. ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయం ఉపసంహరించుకుని.. స్టీల్‌ప్లాంట్‌కు గనులు కేటాయించాలని డిమాండ్ చేశారు. కొత్త పరిశ్రమల్ని ఇవ్వకుండా ఉన్న పరిశ్రమల్ని ప్రైవేట్‌పరం చేయడం దారుణమన్నారు. ఏపీకే మణిహారంగా ఉన్న స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకోవాల్సిన అవసరం ప్రతీ ఒక్కరిపైనా ఉందన్నారు. వేలాది కోట్ల విలువైన ప్లాంట్‌ను కారుచౌకగా కేంద్రం అమ్మేస్తోందని ఆరోపించారు. ఈ అంశంపై రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతిని కలుస్తామని కమిటీ నేతలు తెలిపారు. రాబోయే రోజుల్లో దశలవారీగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. త్వరలోనే సమావేశాన్ని ఏర్పాటు చేసి భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను విడుదల చేస్తామని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నేతలు తెలిపారు.

Tags:    

Similar News