స్టీల్ ప్లాంట్ ఉద్యమం.. కేఏ పాల్‌ ఫోటోకు పాలాభిషేకం

దిశ, వెబ్ డెస్క్: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకోవాలంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ హైకోర్టును ఆశ్రయించారు. ప్రైవేటీకరణను అడ్డుకోవాలని కోరుతూ పిల్‌ వేశారు. ఈ సందర్భంగా జీపీఏ ద్వారా పిల్‌ వేయవచ్చా అని ధర్మాసనం ప్రశ్నించింది. రూల్‌ నెం.4 ద్వారా పిల్‌ వేయవచ్చని ధర్మాసనానికి న్యాయవాది యలమంజుల బాలాజీ తెలిపారు. కేఏపాల్‌ ఇతరదేశాల్లో పర్యటిస్తు్న్న నేపథ్యంలో జీపీఏ ద్వారా వేసినట్లు కోర్టుకు స్పష్టం చేశారు. జీపీఏ ద్వారా పిల్‌ వేయవచ్చా లేదా అనేది వచ్చే […]

Update: 2021-03-05 04:13 GMT

దిశ, వెబ్ డెస్క్: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకోవాలంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ హైకోర్టును ఆశ్రయించారు. ప్రైవేటీకరణను అడ్డుకోవాలని కోరుతూ పిల్‌ వేశారు. ఈ సందర్భంగా జీపీఏ ద్వారా పిల్‌ వేయవచ్చా అని ధర్మాసనం ప్రశ్నించింది. రూల్‌ నెం.4 ద్వారా పిల్‌ వేయవచ్చని ధర్మాసనానికి న్యాయవాది యలమంజుల బాలాజీ తెలిపారు. కేఏపాల్‌ ఇతరదేశాల్లో పర్యటిస్తు్న్న నేపథ్యంలో జీపీఏ ద్వారా వేసినట్లు కోర్టుకు స్పష్టం చేశారు. జీపీఏ ద్వారా పిల్‌ వేయవచ్చా లేదా అనేది వచ్చే వారం నిర్ణయిస్తామని హైకోర్టు అభిప్రాయపడింది.

ఇదిలా ఉంటే కూర్మన్నపాలెం జంక్షన్ దగ్గర కేఏ పాల్ చిత్ర పటానికి స్టీల్‌ప్లాంట్‌ కేఏ పాల్ హైకోర్టులో పిల్ వేయడంపట్ల విశాఖ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేఏ పాల్‌ ఫోటోకు విశాఖలో పాలాభిషేకం చేశారు. కూర్మన్నపాలెం జంక్షన్ దగ్గర పాల్ చిత్ర పటానికి స్టీల్‌ప్లాంట్‌ ఉద్యోగులు పాలాభిషేకం చేసి ప్రశంసలు కురిపించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా హైకోర్టులో కేఏ పాల్ పిటిషన్‌ వేసినందుకు సంతోషించిన ఉద్యోగులు ఇలా తమ కృతజ్ఞతలు తెలిపారు.

Tags:    

Similar News