ఎల్జీ పాలిమర్స్‌పై హైపవర్ కమిటీ మీటింగ్ షురూ

దిశ ఏపీ బ్యూరో: గత నెల 7వ తేదీన విశాఖపట్టణంలోని గోపాలపట్నం దగ్గర ఆర్ఆర్ వెంకటాపురంలోని ఎల్జీ పాలిమర్స్‌ కంపెనీలో స్టైరీన్ గ్యాస్‌ లీకేజీ ఘటనలో 14 మంది మృత్యువాత పడగా, పశుపక్ష్యాదులు, చెట్లు సైతం ప్రాణాలు కోల్పోయాయి. ఐదు కిలోమీటర్ల రేడియస్‌లోని గ్రామాల ప్రజలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీనిపై తీవ్రంగా స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం నిపుణులతో దర్యాప్తుకు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించిన హైపవర్‌ కమిటీ సమావేశం ప్రారంభమైంది. మూడు రోజుల […]

Update: 2020-06-06 05:47 GMT

దిశ ఏపీ బ్యూరో: గత నెల 7వ తేదీన విశాఖపట్టణంలోని గోపాలపట్నం దగ్గర ఆర్ఆర్ వెంకటాపురంలోని ఎల్జీ పాలిమర్స్‌ కంపెనీలో స్టైరీన్ గ్యాస్‌ లీకేజీ ఘటనలో 14 మంది మృత్యువాత పడగా, పశుపక్ష్యాదులు, చెట్లు సైతం ప్రాణాలు కోల్పోయాయి. ఐదు కిలోమీటర్ల రేడియస్‌లోని గ్రామాల ప్రజలు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీనిపై తీవ్రంగా స్పందించిన రాష్ట్ర ప్రభుత్వం నిపుణులతో దర్యాప్తుకు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించిన హైపవర్‌ కమిటీ సమావేశం ప్రారంభమైంది.

మూడు రోజుల పాటు హైపవర్ కమిటీ సమావేశాలు నిర్వహించనుంది. తొలి రోజు నిపుణులతో సమావేశం కానుంది. రెండో రోజు బాధిత గ్రామాల ప్రజలతో సమావేశం కానుంది. మూడవ రోజు వివిధ పార్టీలతో సమావేశం కానుంది. ఇందులో భాగంగా తొలి రోజు నిర్వహించిన ఈ సమావేశంలో కమిటీ చైర్మన్‌, భూమి శిస్తు చీఫ్‌ కమిషనర్‌ (సీసీఎల్‌ఎ) నీరబ్‌కుమార్‌ ప్రసాద్‌, కాలుష్య నియంత్రణ మండలి మెంబర్‌ సెక్రటరీ వివేక్‌ యాదవ్‌, నగర పోలీస్‌ కమిషనర్‌ ఆర్కే మీనా, కలెక్టర్‌ వినయ్‌చంద్‌ పాల్గొన్నారు.

గ్యాస్‌ లీకేజీ ఘటనకు సంబంధించి మొత్తం సమాచారాన్ని సేకరించి, దానిని క్రోడీకరించి సమగ్ర నివేదికను రూపొందించడానికి వీలుగా హైపవర్‌ కమిటీ సన్నాహాలు చేస్తోంది. సంఘటన ఎలా జరిగింది. లీకేజీకి సంబంధించిన అంశాలు విపులంగా పరిశీలించనుంది. వివిధ కమిటీల నివేదికలను పరిశీలించి, పర్యావరణ, సాంకేతిక నిపుణుల అభిప్రాయాలు తెలుసుకొని, ప్రజల వినతులు అధ్యయనం చేసి.. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వారందరి నుంచి సమాచారం సేకరించడానికి కమిటీ సన్నాహాలు చేస్తోంది. ఈ ప్రమాదంపై ఇప్పటికే పలు నివేదికలు రావడంతో పూర్తిస్థాయి ముసాయిదా నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి సమర్పించనుంది.

Tags:    

Similar News