కోహ్లీ బ్యాటింగ్ టెక్నిక్‌లో లోపం : రమీజ్ రాజా

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ సెంచరీ చేయక ఏడాదిన్నర గడిచిపోయింది. అడపాదడపా అర్ద సెంచరీలు చేస్తున్నా.. భారీ స్కోరుగా మాత్రం మలచలేక పోతున్నాడు. దీనికి కారణం కోహ్లీ బ్యాటింగ్‌లో ఉన్న చిన్న లోపమే అని పాకిస్తాన్ మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత రమీజ్ రాజా అంటున్నారు. ఆ లోపాన్ని కనుక కోహ్లీ సరిదిద్దుకుంటే తప్పకుండా భారీ స్కోర్లు చేస్తానడి రాజా చెబుతున్నారు. ‘కోహ్లీ బ్యాటింగ్ చేసే సమయంలో బంతి ఆలస్యంగా వస్తే […]

Update: 2021-06-05 10:48 GMT

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ సెంచరీ చేయక ఏడాదిన్నర గడిచిపోయింది. అడపాదడపా అర్ద సెంచరీలు చేస్తున్నా.. భారీ స్కోరుగా మాత్రం మలచలేక పోతున్నాడు. దీనికి కారణం కోహ్లీ బ్యాటింగ్‌లో ఉన్న చిన్న లోపమే అని పాకిస్తాన్ మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత రమీజ్ రాజా అంటున్నారు. ఆ లోపాన్ని కనుక కోహ్లీ సరిదిద్దుకుంటే తప్పకుండా భారీ స్కోర్లు చేస్తానడి రాజా చెబుతున్నారు. ‘కోహ్లీ బ్యాటింగ్ చేసే సమయంలో బంతి ఆలస్యంగా వస్తే లెగ్ సైడ్ వైపు అడ్డంగా ఆడుతున్నాడు.

దీంతో అతడి మణికట్టుపై ఒత్తిడి పడి భారీ షాట్లు కొట్టలేక పోతున్నాడు. అదే తన పొజిషన్‌లోనే ఉండి స్ట్రెయిట్‌గా ఆడితే సమస్య తీరిపోతుంది. తనదైన శైలిలో ఫ్లిక్స్ చేస్తే అసలు సమస్యే ఉండదు. అయితే ఇది చిన్న సలహా మాత్రమే. కోహ్లీకి ఏం చేయాలో బాగా తెలుసు. అతడి బ్యాటింగ్‌పై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్‌లో కోహ్లీ తప్పకుండా రాణిస్తాడు. అతడు ఇంగ్లాండ్ పర్యటనలో భారీ స్కోర్లు చేస్తాడు’ అని రమీజ్ రాజా అన్నారు.

Tags:    

Similar News