వినాయక చవితి ఇంట్లోనే జరుపుకోవాలి: తలసాని
దిశ ప్రతినిధి, హైదరాబాద్: కరోనా నేపథ్యంలో ఈ సంవత్సరం వినాయక చవితిని ప్రజలు తమ ఇండ్లలోనే జరుపుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు. ఈ మేరకు సోమవారం మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో హోంమంత్రి మహమూద్ అలీ సమక్షంలో హైదరాబాదు, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనర్ లు అంజనీ కుమార్, సజ్జనార్, మహేష్ భగవత్, మహానగర పాలక సంస్థ కమిషనర్ లోకేష్ కుమార్, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి అద్యక్ష, కార్యదర్శులు రాఘవరెడ్డి, డాక్టర్ […]
దిశ ప్రతినిధి, హైదరాబాద్: కరోనా నేపథ్యంలో ఈ సంవత్సరం వినాయక చవితిని ప్రజలు తమ ఇండ్లలోనే జరుపుకోవాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు. ఈ మేరకు సోమవారం మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో హోంమంత్రి మహమూద్ అలీ సమక్షంలో హైదరాబాదు, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనర్ లు అంజనీ కుమార్, సజ్జనార్, మహేష్ భగవత్, మహానగర పాలక సంస్థ కమిషనర్ లోకేష్ కుమార్, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి అద్యక్ష, కార్యదర్శులు రాఘవరెడ్డి, డాక్టర్ భగవంతరావు, విశ్వహిందు పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు రామరాజు, ఇతర ప్రతినిధులతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ కరోనా మహమ్మారి దృష్ట్యా ప్రజలు, గణేష్ ఉత్సవాల నిర్వాహకులు పరిస్థితులను అవగాహన చేసుకొని ఇండ్లలోనే విగ్రహాలను ప్రతిష్టించి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించుకుని ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు దేవాదాయ శాఖ పరిధిలోని అన్ని గణేష్ ఆలయాలలో గణేష్ నవరాత్రులు పూర్తయ్యే వరకు వినాయక పూజలు నిర్వహించాలని దేవాదాయ శాఖ కమిషనర్ ను ఆయన ఆదేశించారు.