పోలీసుల కీలక నిర్ణయం.. ఆ ఏరియా ఇక నో డ్రోన్ జోన్

జలంధర్: పంజాబ్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. పఠాన్‌కోట్ జిల్లాలోని అంతర్జాతీయ సరిహద్దులకు సమీపంగా ఉన్న పలు గ్రామాలను నో డ్రోన్ జోన్‌గా ప్రకటించారు. ఈ నెల 14న పంజాబ్‌లోని కోజీచాక్ గ్రామానికి 100 మీటర్ల దూరంలో పాకిస్తాన్‌కు చెందిన డ్రోన్ ఒకటి కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పంజాబ్‌లో అంతర్జాతీయ సరిహద్దుకు 25కిలో మీటర్ల వరకు నో డ్రోన్ జోన్ ప్రకటించారు. ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు […]

Update: 2021-03-21 00:00 GMT

జలంధర్: పంజాబ్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. పఠాన్‌కోట్ జిల్లాలోని అంతర్జాతీయ సరిహద్దులకు సమీపంగా ఉన్న పలు గ్రామాలను నో డ్రోన్ జోన్‌గా ప్రకటించారు. ఈ నెల 14న పంజాబ్‌లోని కోజీచాక్ గ్రామానికి 100 మీటర్ల దూరంలో పాకిస్తాన్‌కు చెందిన డ్రోన్ ఒకటి కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పంజాబ్‌లో అంతర్జాతీయ సరిహద్దుకు 25కిలో మీటర్ల వరకు నో డ్రోన్ జోన్ ప్రకటించారు. ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

ఇక పటాన్ కోట్ సమీపంలో ఎలాంటి డ్రోన్ కదలికలు కనిపించినా తమకు సమాచారం అందించాలని ప్రజలను పోలీసులు కోరుతున్నారు. డ్రోన్ కదలికలపై సమాచారం అందించేందుకు ప్రత్యేక హెల్ప్ లైన్ నెంబర్‌ను ఏర్పాటు చేయడంతో పాటు దీనికోసం ఓ ప్రత్యేక అధికారిని నియమిస్తున్నట్టు తెలిపారు.

Tags:    

Similar News