పోలీసు స్టేషన్ ఎదుట గ్రామస్తుల ఆందోళన

దిశ, నిజామాబాద్ రూరల్: నిజామాబాద్ జిల్లా సిరికొండలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అత్యాచారం, హత్యకు గురైన పుర్రె మమత కుటుంబానికి న్యాయం చేయాలని న్యావనంది గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే.. న్యావనంది గ్రామానికి చెందిన పుర్రె మమత అనే మహిళ గత శనివారం రోజులాగే పొలం పనులకు వెళ్లి శవమై తేలింది. ఒంటిపై బట్టలు లేకపోవడం, ఎముకలు విరిగి ఉండటంతో పాటు ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబసభ్యులు పోలీసులకు, గ్రామ సర్పంచ్‎కు తెలిపారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు […]

Update: 2020-10-08 05:08 GMT

దిశ, నిజామాబాద్ రూరల్:

నిజామాబాద్ జిల్లా సిరికొండలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అత్యాచారం, హత్యకు గురైన పుర్రె మమత కుటుంబానికి న్యాయం చేయాలని న్యావనంది గ్రామస్తులు ఆందోళన చేపట్టారు.

వివరాల్లోకి వెళ్తే.. న్యావనంది గ్రామానికి చెందిన పుర్రె మమత అనే మహిళ గత శనివారం రోజులాగే పొలం పనులకు వెళ్లి శవమై తేలింది. ఒంటిపై బట్టలు లేకపోవడం, ఎముకలు విరిగి ఉండటంతో పాటు ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబసభ్యులు పోలీసులకు, గ్రామ సర్పంచ్‎కు తెలిపారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపించి అనంతరం అంత్యక్రియలు పూర్తి చేశారు. ఘటన జరిగి వారం రోజులు గడుస్తున్నా పోస్టుమార్టం రిపోర్టు రాకపోవడంతో పాటు పోలీసులు కేసును వదిలేయడంతో కుటుంబసభ్యులు, గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని గ్రామాస్థూలంతా ఆందోళన చేపట్టారు. గ్రామ సర్పంచ్, పోలీసులు కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు.

సిరికొండ పోలీసు స్టేషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో ఏసీపీ శ్రీనివాస్ అక్కడికి చేరుకుని నిందితులను త్వరలోనే పట్టుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో న్యావనంది గ్రామస్తులు ఆందోళన విరమించారు. అధికార పార్టీకి చెందిన వారు నిందితుల జాబితాలో ఉండటంతో వారికి పోలీసులు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మృతురాలు కుటుంబీకులు వ్యవసాయం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తుందని, మమతకు ఇద్దరు పిల్లలున్నారని వారిని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలంటూ తహశీల్దార్ మల్లేష్, ఏసీపీ శ్రీనివాస్ ‎కుమార్‎కు వినతిపత్రం అందజేశారు.

Tags:    

Similar News