కోవిడ్ వ్యాక్సిన్.. నదిలోకి దూకి పరిగెత్తిన గ్రామస్థులు
దిశ, వెబ్ డెస్క్: కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని అతలాకుతలం చేస్తోంది. ఈ మహమ్మారి వైరస్ ని కట్టడి చేయడానికి ప్రభుత్వాలు ఎంతగానో శ్రమిస్తున్నాయి. ఇక ఈ కట్టడిలో భాగంగానే ప్రతి ఒక్కరు తప్పకుండ వ్యాక్సిన్ వేయించుకోవాలని ప్రభుత్వాలు ఆదేశాలు జారీచేసింది. ఇక ఆ వ్యాక్సిన్ కోసం జనాలు ఆరోగ్య కేంద్రాలు బారులు తీరుతున్నారు. వ్యాక్సిన్ స్టాక్ లేక టీకా తీసుకోకుండానే వెనుతిరుగుతున్నారు. ఇదంతా ఒక ఎత్తయితే.. మాకు టీకా వద్దు.. మమ్మల్ని వదిలేయండి అంటూ యూపీలోని […]
దిశ, వెబ్ డెస్క్: కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని అతలాకుతలం చేస్తోంది. ఈ మహమ్మారి వైరస్ ని కట్టడి చేయడానికి ప్రభుత్వాలు ఎంతగానో శ్రమిస్తున్నాయి. ఇక ఈ కట్టడిలో భాగంగానే ప్రతి ఒక్కరు తప్పకుండ వ్యాక్సిన్ వేయించుకోవాలని ప్రభుత్వాలు ఆదేశాలు జారీచేసింది. ఇక ఆ వ్యాక్సిన్ కోసం జనాలు ఆరోగ్య కేంద్రాలు బారులు తీరుతున్నారు. వ్యాక్సిన్ స్టాక్ లేక టీకా తీసుకోకుండానే వెనుతిరుగుతున్నారు. ఇదంతా ఒక ఎత్తయితే.. మాకు టీకా వద్దు.. మమ్మల్ని వదిలేయండి అంటూ యూపీలోని ప్రజలు పరిగెడుతున్నారు. వ్యాక్సిన్ లేక అందరు బాధపడుతుంటే.. అక్కడి గ్రామస్థులు వ్యాక్సిన్ ఉన్నా కాని వేయించుకోవడానికి భయపడి నదిలో దూకి పారిపోయిన ఘటన తాజాగా వెలుగు చూసింది. వివరాలలోకి వెళితే..
ఉత్తరప్రదేశ్ లోని బారాబంకీ గ్రామవాసులకు కొవిడ్ టీకాలు వేయడానికి ఆరోగ్యశాఖ అధికారుల బృందం గ్రామానికి చేరుకుంది. అందరికి కరోనా టీకాలు వేయనున్నట్లు వైద్యులు గ్రామస్థులకు తెలిపారు. ఆ మాట వినడంతో గ్రామస్థులు పరుగు లంకించుకున్నారు. కొవిడ్ టీకా ప్రాముఖ్యత, ప్రయోజనాల గురించి డివిజనల్ మెజిస్ట్రేట్ వివరించి చెప్పి గ్రామస్థులకున్న అపోహలను తొలగించడానికి ప్రయత్నించిన వారు వినలేదు. ఎక్కడ గ్రామంలోనే ఉంటే టీకా వేస్తారేమోనని గ్రామా ఒడ్డున ఉన్న సరయూ నదిలోకి దూకి మరీ పారిపోయారు. ఇంజక్షన్ అంటే విషపూరితమైనదని, దాన్ని తీసుకొంటే చనిపోతామనే భయం గ్రామస్థుల మనసులో నాటుకుపోయిందని ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. చాలా ప్రయత్నాలు చేసి కష్టపడి ఆ గ్రామంలో 14మందికి మాత్రం టీకాలు వేశామని తెలిపారు.