యస్ బ్యాంక్ నిర్వాకంతో బాబుపై విజయసాయిరెడ్డి విమర్శలు

మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిపై ఒంటికాలిపై లేచే వైఎస్సార్సీపీ శాసనసభాపక్ష నేత, ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. యస్ బ్యాంక్ నిర్వాకం నేపథ్యంలో ఆయన ట్వీట్ చేస్తూ, ‘చంద్రబాబు ఎస్‌ బ్యాంకును అడ్డం పెట్టుకుని రాష్ట్రాన్ని లూటీ చేశాడు.1,300 కోట్ల రూపాయల టీటీడీ నిధులు డిపాజిట్ చేయించి కమీషన్లు తీసుకున్నాడు. ఛైర్మన్ సుబ్బారెడ్డి గారు సకాలంలో స్పందించి డిపాజిట్లను వెనక్కు తీసుకోవడంతో ప్రమాదం తప్పింది. ఎస్‌ బ్యాంకుకు ఏపీ టూరిజం శాఖ నిధులనూ దోచిపెట్టాడు. […]

Update: 2020-03-07 01:26 GMT

మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిపై ఒంటికాలిపై లేచే వైఎస్సార్సీపీ శాసనసభాపక్ష నేత, ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. యస్ బ్యాంక్ నిర్వాకం నేపథ్యంలో ఆయన ట్వీట్ చేస్తూ,

‘చంద్రబాబు ఎస్‌ బ్యాంకును అడ్డం పెట్టుకుని రాష్ట్రాన్ని లూటీ చేశాడు.1,300 కోట్ల రూపాయల టీటీడీ నిధులు డిపాజిట్ చేయించి కమీషన్లు తీసుకున్నాడు. ఛైర్మన్ సుబ్బారెడ్డి గారు సకాలంలో స్పందించి డిపాజిట్లను వెనక్కు తీసుకోవడంతో ప్రమాదం తప్పింది. ఎస్‌ బ్యాంకుకు ఏపీ టూరిజం శాఖ నిధులనూ దోచిపెట్టాడు. ఇంకెన్ని ఉన్నాయో?’ అని ఆరోపించారు. ఇందుకు రుజువుగా ఆయన ఎస్‌ బ్యాంకుకు సంబంధించిన ఓ స్క్రీన్‌ షాట్‌ను పోస్ట్ చేశారు.

కాగా, యస్ బ్యాంకు పెట్టుబడి దారుల మధ్య నెలకొన్న విభేదాల నేపథ్యంలో ఆ బ్యాంకులో ఇన్వెస్టర్లు వెనక్కి మళ్లారు. దీనికి తోడు మనీ ల్యాండరింగ్, నిధుల మళ్లింపు వంటి అంశాలు ఆ బ్యాంకు మూసివేతకు దారితీస్తుండగా, బ్యాంకులో వాటా కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం ముందుకు రావడం విశేషం.

Tags: vijayasai reddy, chandrababu, yes bank, tdp, ysrcp, twitter

Tags:    

Similar News