అమ్మా… నీవు లేని జీవితం నాకెందుకమ్మా !
దిశ, వెబ్‌డెస్క్: సోషల్ మీడియా ఎంత యూజ్‌ఫుల్‌గా ఉంటుందో అంత విషాదంగా చేస్తుందనడానికి ఈ ఘటనే ఉదాహరణ. ఎవ్రీ డే ఎర్లీ మార్నింగ్ నుంచి మిడ్‌నైట్ వరకు ఎవ్రీ పర్సన్ ఏవిధంగా ఎలా బానిస అవుతున్నారో చూస్తూనే ఉన్నాం. కొందరు మొబైల్‌లోనే జీవిస్తూ సంసారంలో నిప్పులు పోసుకుంటుండగా, మరికొందరు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌లలో ప్రతి నిమిషం తేలియాడుతూ అందులోనే టైం పాస్ చేస్తున్నారు. ఇదే క్రమంలో ఈ మధ్యకాలంలో ఫుల్ ఫేమస్ అయిన […]
దిశ, వెబ్‌డెస్క్: సోషల్ మీడియా ఎంత యూజ్‌ఫుల్‌గా ఉంటుందో అంత విషాదంగా చేస్తుందనడానికి ఈ ఘటనే ఉదాహరణ. ఎవ్రీ డే ఎర్లీ మార్నింగ్ నుంచి మిడ్‌నైట్ వరకు ఎవ్రీ పర్సన్ ఏవిధంగా ఎలా బానిస అవుతున్నారో చూస్తూనే ఉన్నాం. కొందరు మొబైల్‌లోనే జీవిస్తూ సంసారంలో నిప్పులు పోసుకుంటుండగా, మరికొందరు ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్‌లలో ప్రతి నిమిషం తేలియాడుతూ అందులోనే టైం పాస్ చేస్తున్నారు. ఇదే క్రమంలో ఈ మధ్యకాలంలో ఫుల్ ఫేమస్ అయిన టిక్‌టాక్ యాప్ మోజులో పడి లేనిగొడవలు తెచ్చుకోవడం, ప్రాణాలు తీయడం, ప్రాణాలు తీసుకోవడం వంటి సంఘటనలు జరగడం మనం చూస్తున్నాం. సరిగ్గా ఇలాంటి ఘటనే ఆంధ్రప్రదేశ్‌లో జరిగింది. ఓ కుటుంబాన్ని ఆగం చేసింది. పిల్లల భవిష్యత్‌ను ప్రశ్నార్థకం చేసింది. భార్య ఎక్కువ సమయం టిక్‌టాక్ చేస్తోందన్న కోపంతో భర్త మందలించగా.. ఆ మహిళ సూసైడ్ చేసుకుంది. దీంతో అమ్మలేని జీవితం తనకెందుకని ఆమె కుమారుడు ప్రాణాలు తీసుకున్నాడు. దీంతో కుటుంబంతో పాటు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. వివరాలు ఇలా ఉన్నాయి.
విజయవాడలోని జక్కంపూడి జేఎన్‌యూఆర్ఎం కాలనీలో నివాసం ఉంటున్న దంపతులకు ఓ కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. లాక్‌డౌన్ నేపథ్యంలో ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఇంట్లోనే ఉంటున్నారు. ఇదే క్రమంలో భార్య ఎక్కువ సమయం టిక్‌టాక్‌లు చేస్తోందని భర్త మందలించాడు. అయినా ఆమె టిక్‌టాక్‌లు చేయడం మానలేదు. దీంతో ఆ దంపతుల మధ్య రెండ్రోజులుగా వాగ్వాదం జరుగుతోంది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన భార్య సోమవారం ఆత్మహత్య చేసుకుంది. ఈ క్రమంలోనే తల్లి మృతిని జీర్ణించుకోలేక పోయిన కుమారుడు సైనెడ్ తాగి ప్రాణాలు తీసుకున్నాడు. ఒకరోజు వ్యవధిలోనే తల్లీకొడుకు మృతి చెందడంతో ఫ్యామిలీ, గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.