మహిళలకు సీఎం జగన్‌ క్షమాపణ చెప్పాలి: కేశినేని శ్వేత

దిశ, వెబ్ డెస్క్: మహిళా లోకానికి ఏపీ సీఎం వైఎస్ జగన్‌ క్షమాపణలు చెప్పాలని విజయవాడ టీడీపీ మేయర్ అభ్యర్థి కేశినేని శ్వేత డిమాండ్ చేశారు. అమ్మవారిని దర్శించుకునేందుకు వెళ్తున్న మహిళల్ని లాఠీలతో వేధించడం సిగ్గుచేటన్నారు. మహిళా దినోత్సవం పర్వదినం నాడు మహిళా రైతులపై లాఠీ చార్జి చేయడం దుర్మార్గమన్నారు. మహిళల కన్నీరుకు కారణమైన జగన్ కి త్వరలోనే ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. మహిళలపై లాఠీచార్జ్ చేస్తుంటే హోం మంత్రి మేకతోటి సుచరిత ఏం చేస్తున్నట్లు […]

Update: 2021-03-08 06:31 GMT

దిశ, వెబ్ డెస్క్: మహిళా లోకానికి ఏపీ సీఎం వైఎస్ జగన్‌ క్షమాపణలు చెప్పాలని విజయవాడ టీడీపీ మేయర్ అభ్యర్థి కేశినేని శ్వేత డిమాండ్ చేశారు. అమ్మవారిని దర్శించుకునేందుకు వెళ్తున్న మహిళల్ని లాఠీలతో వేధించడం సిగ్గుచేటన్నారు. మహిళా దినోత్సవం పర్వదినం నాడు మహిళా రైతులపై లాఠీ చార్జి చేయడం దుర్మార్గమన్నారు. మహిళల కన్నీరుకు కారణమైన జగన్ కి త్వరలోనే ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. మహిళలపై లాఠీచార్జ్ చేస్తుంటే హోం మంత్రి మేకతోటి సుచరిత ఏం చేస్తున్నట్లు అని కేశినేని శ్వేత నిలదీశారు. హోం మంత్రిగా ఉన్న మహిళ చేతులు కట్టుకుని చూస్తున్నందుకు సిగ్గుపడాలన్నారు. మహిళల్ని, రైతుల్ని కన్నీరు పెట్టించి జగన్ నియంతలా మారారంటూ కేశినేని శ్వేత ధ్వజమెత్తారు.

Tags:    

Similar News