పోలీసులెవర్నీ వదలరు: విజయసాయిరెడ్డి

వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సోషల్‌ మీడియాలో తనను అవమానిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఏపీ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆయన ఫేక్‌ అకౌంట్లతో తనపై అసభ్య పదజాలంతో దుష్ర్పచారం చేస్తున్నవారిని శిక్షించాలని కోరారు. తన వ్యక్తిగత ప్రతిష్ట, గౌరవ, మర్యాదలకు భంగం కలిగించేలా తన పేరుతో కొందరు సోషల్‌ మీడియాలో ఫేక్‌ అకౌంట్లు సృష్టించారని ఆయన ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఫేక్‌గ్యాంగ్‌పై సైబర్‌ […]

Update: 2020-05-10 07:56 GMT

వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సోషల్‌ మీడియాలో తనను అవమానిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఏపీ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేసిన ఆయన ఫేక్‌ అకౌంట్లతో తనపై అసభ్య పదజాలంతో దుష్ర్పచారం చేస్తున్నవారిని శిక్షించాలని కోరారు. తన వ్యక్తిగత ప్రతిష్ట, గౌరవ, మర్యాదలకు భంగం కలిగించేలా తన పేరుతో కొందరు సోషల్‌ మీడియాలో ఫేక్‌ అకౌంట్లు సృష్టించారని ఆయన ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఫేక్‌గ్యాంగ్‌పై సైబర్‌ క్రైమ్‌ పోలీసులు విచారణ మొదలెట్టారని, సైబర్ క్రైమ్ చట్టం నుండి నిందితులు ఎవరూ కూడా తప్పించుకోలేరని ఆయన పేర్కొన్నారు. తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలా అసత్య ఆరోపణలు, ప్రచారాలు చేస్తూ సోషల్ మీడియాలో అసభ్య, ఫేక్‌ పోస్టులు పెట్టే వారితో పాటు వాటిని షేర్ చేసే వారిని కూడా ఏపీ సైబర్ క్రైమ్ పోలీసులు వదలరని ఆయన హెచ్చరించారు.

Tags:    

Similar News