20 కోట్లకు కన్నా అమ్ముడు పోయారు: విజయసాయిరెడ్డి
ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ 20 కోట్లకు అమ్ముడుపోయారని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. గత కొంత కాలంగా కన్నా లక్ష్మీ నారాయణ అధికార పక్షంపై తీవ్ర విమర్శలు చేస్తూ పార్టీపై పట్టు సాధించే ప్రయత్నంలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనపై విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబు మాదిరే కన్నా కూడా ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై విమర్శలు గుప్పించారు. చంద్రబాబు […]
ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ 20 కోట్లకు అమ్ముడుపోయారని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. గత కొంత కాలంగా కన్నా లక్ష్మీ నారాయణ అధికార పక్షంపై తీవ్ర విమర్శలు చేస్తూ పార్టీపై పట్టు సాధించే ప్రయత్నంలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనపై విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబు మాదిరే కన్నా కూడా ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై విమర్శలు గుప్పించారు. చంద్రబాబు ఇంకా తానే ఏపీ సీఎం అనుకుంటున్నారని, వీడియో కాన్ఫరెన్స్ లతో సమయాన్ని వృథా చేస్తున్నారని సెటైర్ వేశారు. ఏపీ శాసనమండలి రద్దు కాబోతోందన్న ఆందోళనతో బాబు ప్రవర్తిస్తున్నారని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. రేపు చంద్రబాబు పుట్టినరోజు అని చెబుతూ, ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నానని తెలిపారు.
tags:ysrcp, bjp, tdp, vijayasai reddy, kanna laxminarayana, chandrababu naidu