చంద్రబాబుని విజయసాయిరెడ్డి పొగిడాడా?

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడంటే వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డికి ఎంత ప్రేమో అందరికీ తెలిసిందే. చంద్రబాబునాయుడిపై విమర్శలు చేయనిదే విజయసాయిరెడ్డికి నిద్ర పట్టదని ఆ రెండు పార్టీల నేతలు పేర్కొంటారు. వారి వ్యాఖ్యలను నిజం చేస్తూ.. బాబుని విమర్శిస్తూ ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఏదో ఒక ట్వీట్ చేస్తే కానీ విజయసాయిరెడ్డి మనసు నిలవదు. కౌంటర్లు, విమర్శలతో బలోపేతమైన వారి సంబంధాలు కాస్త దెబ్బతిన్నట్టు కనిపిస్తున్నాయి. అందుకే తొలిసారి ఆయనను అభినందిస్తూ ట్వీట్ చేశారు. ఆయన […]

Update: 2020-02-28 07:45 GMT

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడంటే వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డికి ఎంత ప్రేమో అందరికీ తెలిసిందే. చంద్రబాబునాయుడిపై విమర్శలు చేయనిదే విజయసాయిరెడ్డికి నిద్ర పట్టదని ఆ రెండు పార్టీల నేతలు పేర్కొంటారు. వారి వ్యాఖ్యలను నిజం చేస్తూ.. బాబుని విమర్శిస్తూ ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఏదో ఒక ట్వీట్ చేస్తే కానీ విజయసాయిరెడ్డి మనసు నిలవదు. కౌంటర్లు, విమర్శలతో బలోపేతమైన వారి సంబంధాలు కాస్త దెబ్బతిన్నట్టు కనిపిస్తున్నాయి. అందుకే తొలిసారి ఆయనను అభినందిస్తూ ట్వీట్ చేశారు.

ఆయన ట్వీట్లపై కానీ.. వ్యాఖ్యలపై కానీ చంద్రబాబునాయుడు ఏనాడూ స్పందించలేదు. అయినప్పటికీ విజయసాయిరెడ్డి ట్వీట్ల దాడి ఆగడం లేదు సరికదా మరింత పదును పెరుగుతోంది. నిన్న వైజాగ్‌లో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఆయన ‘కొండపై నుంచి జారిపడుతూ మధ్యలో కొమ్మను పట్టుకుని వేలాడుతున్న పరిస్థితి చంద్రబాబుది. ఏ క్షణంలోనైనా కొమ్మ విరగొచ్చు లేదా పట్టుతప్పి తనే అగాథంలోకి పడిపోవచ్చు. అంత నిస్సహాయతలో కూడా ‘ఒక్కొక్కరి భరతం పడతా, ఎవర్నీ వదిలి పెట్టేది లేదు’ అని బెదిరిస్తున్నాడంటే మామూలు ‘గుండె’ కాదు!’ అంటూ ట్వీట్ చేశారు.

ఈ ట్వీట్ వైరల్‌గా మారింది. ఎట్టకేలకు విజయసాయిరెడ్డి కూడా చంద్రబాబునాయుడు పోరాటపటిమ ముందు తలవంచినట్టే కనబడుతోందంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు పేర్కొంటున్నారు. పోలీసులు ఆంక్షలు విధించినా, వైఎస్సార్సీపీ శ్రేణులు నిరసనలు తెలుపుతున్నా బాబు ఏమాత్రం వెనక్కి తగ్గలేదని ప్రశంసలు కురిపిస్తున్నారు.

Tags:    

Similar News