కరోనాను అరికట్టాలంటే ఈ జాగ్రత్తలు తీసుకొండి : విజయ్

దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్.. ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి. ఇప్పటికే చాలా దేశాలు కోవిడ్ -19 ఎఫెక్ట్‌తో బాధపడుతుండగా… వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు భారత్ కూడా చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు పలు సూచనలు చేస్తూ వీడియోలు రిలీజ్ చేస్తున్నాయి. ఇందులో భాగంగనే తెలంగాణ సర్కార్ కరోనా వ్యాప్తి చెందకుండా కొన్ని జాగ్రత్తలతో కూడిన వీడియోను విడుదల చేసింది. తెలంగాణ వైద్య ఆరోగ్య సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రజాసంక్షేమానికై వీడియో ప్రకటన […]

Update: 2020-03-10 07:45 GMT

దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్.. ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి. ఇప్పటికే చాలా దేశాలు కోవిడ్ -19 ఎఫెక్ట్‌తో బాధపడుతుండగా… వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు భారత్ కూడా చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు పలు సూచనలు చేస్తూ వీడియోలు రిలీజ్ చేస్తున్నాయి. ఇందులో భాగంగనే తెలంగాణ సర్కార్ కరోనా వ్యాప్తి చెందకుండా కొన్ని జాగ్రత్తలతో కూడిన వీడియోను విడుదల చేసింది. తెలంగాణ వైద్య ఆరోగ్య సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రజాసంక్షేమానికై వీడియో ప్రకటన జారీ చేసింది. ఇందుకోసం టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండను బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంచుకుంది. 44 సెకన్ల నిడివితో ఉన్న ఈ వీడియోలో కరోనా వైరస్ ఎలా వస్తుంది? వైరస్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఈ వీడియోలో వివరించాడు విజయ్ దేవరకొండ. కరోనా వైరస్ అరికట్టాలంటే మనందరం ఈ జాగ్రత్తలు తీసుకోవాలని.. వ్యాధి లక్షణాలు ఉంటే వెంటనే 104 నెంబర్‌కు కాల్ చేయాలని సూచించారు.

Tags:    

Similar News