విజయ్ మాటకు హోరెత్తిన సోషల్ మీడియా
దిశ, వెబ్‌డెస్క్: తమిళనాట సినిమాలకు ఆదరణ ఎక్కువ. వరుస హిట్లు పడ్డాయంటే కథానాయకుడు దేవుడైపోతాడు… గుడిలో పూజలు అందుకుంటాడు. తమిళులు హీరోలను అంతగా అభిమానిస్తారు. రజినీ కాంత్, కమల్ హాసన్ శకం ముగిశాక అంతగా ఆదరాభిమానులు పొందుతున్న హీరోలు ఎవరైనా ఉన్నారు అంటే విజయ్, అజిత్‌లే. అన్నింట్లోనూ వీరిద్దరూ సమఉజ్జులే. ఒకరు హిట్ కొట్టారు అంటే మరొకరు బాక్సాఫీస్‌ను షేక్ చేస్తారు. ఆ బాక్సాఫీస్ రికార్డ్‌ను మరొకరు బ్రేక్ చేస్తారు. చాలా ఏళ్లుగా వీరిద్దరి మధ్య అంత […]
దిశ, వెబ్‌డెస్క్: తమిళనాట సినిమాలకు ఆదరణ ఎక్కువ. వరుస హిట్లు పడ్డాయంటే కథానాయకుడు దేవుడైపోతాడు… గుడిలో పూజలు అందుకుంటాడు. తమిళులు హీరోలను అంతగా అభిమానిస్తారు. రజినీ కాంత్, కమల్ హాసన్ శకం ముగిశాక అంతగా ఆదరాభిమానులు పొందుతున్న హీరోలు ఎవరైనా ఉన్నారు అంటే విజయ్, అజిత్‌లే. అన్నింట్లోనూ వీరిద్దరూ సమఉజ్జులే. ఒకరు హిట్ కొట్టారు అంటే మరొకరు బాక్సాఫీస్‌ను షేక్ చేస్తారు. ఆ బాక్సాఫీస్ రికార్డ్‌ను మరొకరు బ్రేక్ చేస్తారు. చాలా ఏళ్లుగా వీరిద్దరి మధ్య అంత ఆరోగ్యకరమైన పోటీ ఉంది. కానీ ఫ్యాన్స్ విషయానికి వచ్చేసరికి మాత్రం పోటీ కాదు పోట్లాట మొదలవుతుంది. మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటూ గొడవలకు దిగుతారు. సోషల్ మీడియాలో అజిత్ ఫ్యాన్స్ విజయ్ గురించి చెడుగా ప్రచారం చేస్తే… విజయ్ ఫ్యాన్స్ మేమేమన్నా తక్కువ తిన్నామా? అంటూ అంతకు మించి చెడ్డవారు అయిపోతారు. ఈ ఫ్యాన్ వార్‌కు ఫుల్ స్టాప్ ఎలా దొరుకుతుంది అని తమిళ ఇండస్ట్రీ బాధపడిపోతున్న వేళ.. ఆ సమయం వచ్చినట్లే అనిపిస్తుంది. ఇందుకు ‘మాస్టర్’ ఆడియో వేడుక వేదిక కాగా… కోలీవుడ్ ఖుష్ అవుతుంది.
‘మాస్టర్’ సినిమా ఆడియో లాంచ్‌కు సూట్లో సూపర్‌గా హాజరయ్యారు హీరో విజయ్. యాంకర్ ఈ సూట్ గురించి ప్రశ్నించగా… నా స్నేహితుడు అజిత్‌లా డ్రెస్ వేసుకుంటే బాగుంటుందని అనిపించిందని.. అందుకే సూట్ వేసుకుని వచ్చానని చెప్పాడు విజయ్. అంతటితో ఆగకుండా మేమిద్దరం ఒకటే అని వ్యాఖ్యానించాడు. దీంతో సోషల్ మీడియాలో ఈ కామెంట్స్ ట్రెండ్ అయ్యాయ్. ఎప్పుడూ విజయ్ను కామెంట్ చేసే అజిత్ అభిమానులు కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. ‘నన్బర్ అజిత్’ అన్న విజయ్ మాటను సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. కనీసం ఈ ట్రెండ్‌తో అయినా… ఫ్యాన్ వార్ ట్రెండ్ ముగుస్తుందో లేదో చూడాలి మరి.
#MasterAudioLaunchOnSunTV
Vijay sir speech About our Ajith sir ..😍😍🤘💪..#NanbarAjith pic.twitter.com/gZgJoEsnqG— ajithkumar (@ajithkumarkama1) March 15, 2020