బంగాళాఖాతంలో బలపడిన అల్పపీడనం..మూడు రోజుల పాటు వర్షాలు
బంగాళాఖాతంలో మూడు రోజుల క్రితం ఏర్పడిన అల్పపీడనం ( low pressure) బలపడింది.
దిశ, వెబ్‌డెస్క్: బంగాళాఖాతంలో మూడు రోజుల క్రితం ఏర్పడిన అల్పపీడనం ( low pressure) బలపడింది. తీవ్ర అల్పపీడనంగా మారి వాయువ్య దిశగా ముందుకు సాగుతోంది. దీని ప్రభావంతో ఏపీకి మూడు రోజుల పాటు వర్షాలు కురువనున్నట్లు వాతావరణ అధికారులు తెలిపారు. దీంతో కాకినాడ, విశాఖ, అనకాపల్లి, విజయనగరం జిల్లాలకు..ఆరెంజ్ అలర్ట్(Orange Alert) జారీ చేశారు. రానున్న 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉండటంతో.. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారుల సూచించారు. ఇదిలా ఉంటే గత వారం రోజులుగా ఏపీలోని వివిధ జిల్లాలో ఎక్కడో ఒక చోటు వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో అల్పపీడనం ప్రభావంతో వర్షాలు కురుస్తుండగా.. ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతిలో భారీ వర్షాలు కురిశాయి.