నేనే ఎందుకు ఆ పని చేయాలి.. నా భర్త చేయకూడదా? : విద్యాబాలన్

దిశ, సినిమా : బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్ బాడీ షేమింగ్‌తో పాటు ఇతర సోషల్ ప్రాబ్లమ్స్ గురించి ఎప్పుడూ వాయిస్ వినిపిస్తూనే ఉంటుంది. ఈ క్రమంలో లింగవివక్ష(జెండర్ డిస్క్రిమినేషన్)గురించి మాట్లాడింది. సిద్ధార్థ్ రాయ్ కపూర్‌తో పెళ్లి అయ్యాక బంధుమిత్రులతో డిన్నర్ చేస్తున్న సమయంలో కుకింగ్ గురించి టాపిక్ రాగా.. సిద్ధార్థ్‌కు, తనకు వంట రాదని అందరికీ తెలిసిందని చెప్పింది. దీంతో అందరూ నవ్వేసి నువ్వు కచ్చితంగా వంట నేర్చుకోవాల్సిందే అని సూచనలు ఇచ్చారని తెలిపింది. ఎందుకు తనే […]

Update: 2021-06-12 06:17 GMT

దిశ, సినిమా : బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్ బాడీ షేమింగ్‌తో పాటు ఇతర సోషల్ ప్రాబ్లమ్స్ గురించి ఎప్పుడూ వాయిస్ వినిపిస్తూనే ఉంటుంది. ఈ క్రమంలో లింగవివక్ష(జెండర్ డిస్క్రిమినేషన్)గురించి మాట్లాడింది. సిద్ధార్థ్ రాయ్ కపూర్‌తో పెళ్లి అయ్యాక బంధుమిత్రులతో డిన్నర్ చేస్తున్న సమయంలో కుకింగ్ గురించి టాపిక్ రాగా.. సిద్ధార్థ్‌కు, తనకు వంట రాదని అందరికీ తెలిసిందని చెప్పింది. దీంతో అందరూ నవ్వేసి నువ్వు కచ్చితంగా వంట నేర్చుకోవాల్సిందే అని సూచనలు ఇచ్చారని తెలిపింది.

ఎందుకు తనే వంట నేర్చుకోవాలి? సిద్ధార్థ్ ఎందుకు నేర్చుకోకూడదు? అని ప్రశ్నించానని చెప్పింది. గతంలో అమ్మ కూడా ఇదే చెప్తే.. ఒక కుక్‌ను పెట్టుకునేంత లేదా కుకింగ్ చేసే భర్తను పెళ్లిచేసుకునేంత డబ్బు సంపాదిస్తానని చెప్పానని అంది. అందరం కూడా లింగ పక్షపాతాన్ని ఎదుర్కొంటున్నామన్న విద్యాబాలన్.. కేవలం మగవారు మాత్రమే కాదు ఆడవాళ్లు కూడా ఆడవారిని తక్కువగా చూసే సందర్భాలు ఉన్నాయని అభిప్రాయపడింది.

 

Tags:    

Similar News