ఎగిరే బంగారు తాబేళ్లు.. ఎక్కడ ఉన్నాయో తెలుసా!

దిశ, ఫీచర్స్ : ఒక్కోసారి ఊహకందని విషయాల ప్రస్తావన వస్తే.. ‘ఏమో గుర్రం ఎగరావచ్చు!’ అని చెప్తుంటాం. అయితే ఇక్కడొక వీడియోను చూస్తే మాత్రం తాబేలు కూడా ఎగరగలదని చెప్పొచ్చునేమో! తాబేలు ఆకారంలో ఉండి, బంగారు వర్ణాన్ని పోలివున్న కీటకాలు ఎగురుతున్న వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతుండటమే ఇందుకు కారణం. ఇంతకీ ఆ కీటకాలు ఎక్కడున్నాయంటే.. ఆగ్నేయ ఆసియాలో వెలుగుచూసిన ఈ తాబేలు ఆకారపు కీటకాల వీడియోను ఒడిషా క్యాడర్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్ సుశాంత నంద […]

Update: 2021-03-14 07:18 GMT

దిశ, ఫీచర్స్ : ఒక్కోసారి ఊహకందని విషయాల ప్రస్తావన వస్తే.. ‘ఏమో గుర్రం ఎగరావచ్చు!’ అని చెప్తుంటాం. అయితే ఇక్కడొక వీడియోను చూస్తే మాత్రం తాబేలు కూడా ఎగరగలదని చెప్పొచ్చునేమో! తాబేలు ఆకారంలో ఉండి, బంగారు వర్ణాన్ని పోలివున్న కీటకాలు ఎగురుతున్న వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతుండటమే ఇందుకు కారణం. ఇంతకీ ఆ కీటకాలు ఎక్కడున్నాయంటే..

ఆగ్నేయ ఆసియాలో వెలుగుచూసిన ఈ తాబేలు ఆకారపు కీటకాల వీడియోను ఒడిషా క్యాడర్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్ సుశాంత నంద ట్విట్టర్ వేదికగా షేర్ చేయగా, అది నెట్టింట ట్రెండ్ అవుతోంది. నెటిజన్లు ఈ బంగారు వర్ణపు కీటకాలను చూసి ఆశ్చర్యపోతున్నారు. బంగారు తాబేలు కీటకం (The Golden Tortoise Beetle) అచ్చం తాబేలు మాదిరిగా ఉందని అంటున్నారు. కాగా ఇలాంటి కీటకం మధ్యప్రదేశ్‌లో‌ని సత్న ప్రాంతంలో ఉందని ఒక యూజర్ కామెంట్ చేశాడు. ‘వావ్ ఇలాంటి కీటకాలను మేం ఎప్పుడు చూడలేదని, ఈ వీడియో షేర్ చేసినందుకు థాంక్స్’ అని కొందరు యూజర్స్ కామెంట్లు చేస్తున్నారు. ‘హ్యారీపోర్టర్’ సినిమాలో వీటిని వాడారేమోనని మరికొందరు పోస్టులు పెడుతున్నారు.

https://twitter.com/susantananda3/status/1368946752829591552?s=20

నిజానికి ఈ కీటకాలు చాలా అరుదైనవి. బంగారపు వర్ణంలో ఉండే ‘చారిడొటెల్ల సెక్స్‌పుంక్చట’ జాతికి చెందిన ఈ కీటకాలు ప్రకృతి ప్రేమికులకు అత్యంత ఇష్టమైనవి. ఇవి తమను తాము రక్షించుకునేందుకు యూనిక్ ఫీచర్స్ కలిగి ఉంటాయి. వాటికి ఇతర కీటకాలు, జంతువుల నుంచి హాని పొంచిఉందని తెలిస్తే, అవి గోల్టెన్ కలర్ నుంచి రెడ్, బ్రౌన్ కలర్‌లోకి మారతాయి. భూమి, ఆకులు, ఇతర ప్రదేశాల ఉపరితలంపై చనిపోయినట్లుగా యాక్ట్ చేసి, తమ ప్రాణాలను రక్షించుకుంటాయి. ఇలా ఇతర జంతువులు, పక్షుల నుంచి తప్పించుకుంటాయి.

Tags:    

Similar News