కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ వీడియో సందేశం

న్యూఢిల్లీ: కరోనాపై సమర్థంగా పోరాడేందుకు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ఇకనైనా మేల్కొని బాధ్యతలు నిర్వర్తించాలని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ పేర్కొన్నారు. వలస కార్మికులు తిరిగి వెళ్లడాన్ని ఆపాలని, వారికి భరోసా కల్పించాలని అన్నారు. ఆపత్కాలం నుంచి బయటపడేవరకు పేదల ఖాతాల్లో నెలకు కనీసం రూ. 6 వేలు జమ చేయాలని సూచించారు. సోనియా గాంధీ శనివారం తన ట్విట్టర్ ఖాతాలో ఐదు నిమిషాల నిడివితో ఓ వీడియోను పోస్ట్ చేశారు. కరోనాపై పోరుకు జాతీయ […]

Update: 2021-05-01 09:21 GMT

న్యూఢిల్లీ: కరోనాపై సమర్థంగా పోరాడేందుకు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ఇకనైనా మేల్కొని బాధ్యతలు నిర్వర్తించాలని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ పేర్కొన్నారు. వలస కార్మికులు తిరిగి వెళ్లడాన్ని ఆపాలని, వారికి భరోసా కల్పించాలని అన్నారు. ఆపత్కాలం నుంచి బయటపడేవరకు పేదల ఖాతాల్లో నెలకు కనీసం రూ. 6 వేలు జమ చేయాలని సూచించారు. సోనియా గాంధీ శనివారం తన ట్విట్టర్ ఖాతాలో ఐదు నిమిషాల నిడివితో ఓ వీడియోను పోస్ట్ చేశారు. కరోనాపై పోరుకు జాతీయ స్థాయిలో వ్యూహాన్ని అమలు చేయాలని, దీనిపై అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించి అన్ని పార్టీల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని వివరించారు.

18ఏళ్లు పైబడినవారికి టీకా పంపిణీ ప్రారంభమైన సందర్భంగా ఆమె దేశవ్యాప్తంగా అందరికీ ఉచితంగా టీకా అందించాలని సూచించారు. టీకాలను ఉచితంగా వేసి ప్రాణాలను కాపాడాలని అన్నారు. టీకా ఉత్పత్తి పెంచడానికి అవసరమైన లైసెన్సులను వేగంగా జారీ చేయాలని తెలిపారు. ప్రాణాధార ఔషధాల బ్లాక్ మార్కెటింగ్‌ను నిలువరించాలని కేంద్రానికి సూచించారు. దేశవ్యాప్తంగా కరోనా టెస్టుల సంఖ్యను పెంచాలని పేర్కొన్నారు. ప్రతి రోజు ఎంతోమంది ప్రియతములను కోల్పోతున్నామని, ఇది పరీక్షా కాలమని అన్నారు. ప్రజలందరూ ఈ సంకట పరిస్థితుల్లో ఒకరికొకరు సహకరించుకోవాలని తెలిపారు. దేశం ఇది వరకు ఎన్నో సంక్షోభ పరిస్థితులను ఇలాగే విజయవంతంగా ఎదుర్కొందని వివరించారు. కరోనా కాలంలో ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వర్తిస్తున్న వైద్యులను ప్రశంసించారు. వారి సేవలు అమూల్యమని అన్నారు.

Tags:    

Similar News