దేవతల మధ్య ఫోటోలు.. విడదల రజని ఆగ్రహం
దిశ, ఏపీ బ్యూరో: చిలకలూరిపేటలో దేవతల మధ్య ఫోటోల ఏర్పాటుపై నియోజకవర్గం ఎమ్మెల్యే విడదల రజని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవాలయ నిర్వహకులపై ఎమ్మెల్యే విడదల రజని మండిపడ్డారు. తక్షణమే ఫ్లెక్సీలు తొలగించాలని ఆదేశించారు. అభిమానంతోనే ఎమ్మెల్యే ఫోటోలు వేశామని ఆలయ నిర్వాహకులు పేర్కొన్నారు. ఇలాంటి చర్యలకు ఎప్పుడూ పాల్పడవద్దని ఎమ్మెల్యే రజని సున్నితంగా మందలించారు. ఇకపోతే దేవీ నవరాత్రుల్లో భాగంగా చిలకలూరిపేట గడియారం స్తంభం దగ్గర ఉన్న పోలేరమ్మ గుడివద్ద దేవునితో సమానంగా అమ్మవారి రూపాల […]
దిశ, ఏపీ బ్యూరో: చిలకలూరిపేటలో దేవతల మధ్య ఫోటోల ఏర్పాటుపై నియోజకవర్గం ఎమ్మెల్యే విడదల రజని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవాలయ నిర్వహకులపై ఎమ్మెల్యే విడదల రజని మండిపడ్డారు. తక్షణమే ఫ్లెక్సీలు తొలగించాలని ఆదేశించారు. అభిమానంతోనే ఎమ్మెల్యే ఫోటోలు వేశామని ఆలయ నిర్వాహకులు పేర్కొన్నారు. ఇలాంటి చర్యలకు ఎప్పుడూ పాల్పడవద్దని ఎమ్మెల్యే రజని సున్నితంగా మందలించారు. ఇకపోతే దేవీ నవరాత్రుల్లో భాగంగా చిలకలూరిపేట గడియారం స్తంభం దగ్గర ఉన్న పోలేరమ్మ గుడివద్ద దేవునితో సమానంగా అమ్మవారి రూపాల మధ్య స్థానిక ఎమ్మెల్యే విడదల రజని దండం పెడుతున్న ఫోటోలతో ఫ్లెక్సీలు ఆలయ ముఖ ద్వారంపై ఏర్పాటు చేశారు. గతంలో ఆ ఫ్లెక్సీ స్థానంలో దుర్గమ్మ నవ రూపాలతో ఫ్లెక్సీ ఉండేది. అయితే ఈ దసరాకు వైసీపీ కార్యకర్తలు దేవతల పక్కన విడదల రజని ఫోటో పెట్టి ఫ్లెక్సీ వేయించారు. ఆ ఫ్లెక్సీని ఆలయ ముఖద్వారంపై పెట్టడం వివాదాస్పదంగా మారింది. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వెంటనే తొలగించాలని ఆదేశించారు. దీంతో ఆలయ నిర్వాహకులు వెంటనే ఫ్లెక్సీని తొలగించారు.