అధికారులను నిలదీసిన ముంపు గ్రామాల బాధితులు
దిశ, మహాదేవపూర్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుతో ముంపు ప్రాంతాల ప్రజలు పెదవి విరుస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అన్నారం బ్యారేజ్ కారణంగా పంట పొలాలు నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం ముంపు ప్రాంతాలను పరిశీలించడానికి వచ్చిన ఈఎన్‌సీ నల్ల వెంకటేశ్వర్ల ఎదుట ముంపు ప్రాంత రైతులు ఆందోళనకు దిగారు. అన్నారం బ్యారేజీ కట్టడం వల్ల బ్యాక్ వాటర్‌తో ఎగువన పంట పొలాలు.. గేట్లు తెరిచినప్పుడు దిగువన […]
దిశ, మహాదేవపూర్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుతో ముంపు ప్రాంతాల ప్రజలు పెదవి విరుస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అన్నారం బ్యారేజ్ కారణంగా పంట పొలాలు నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం ముంపు ప్రాంతాలను పరిశీలించడానికి వచ్చిన ఈఎన్‌సీ నల్ల వెంకటేశ్వర్ల ఎదుట ముంపు ప్రాంత రైతులు ఆందోళనకు దిగారు. అన్నారం బ్యారేజీ కట్టడం వల్ల బ్యాక్ వాటర్‌తో ఎగువన పంట పొలాలు.. గేట్లు తెరిచినప్పుడు దిగువన పంట పొలాలు నీట మునిగి నష్టం వాటిల్లుతుందని చెప్పారు. ఇదే విషయాన్ని ఎన్ని సార్లు చెప్పినా అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు మండిపడ్డారు. దీంతో ఈఎన్‌సీ వెంకటేశ్లర్లు రైతులకు నచ్చ చెప్పారు. అన్ని సమస్యలపై దృష్టి సారించి ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని చెప్పారు.